డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పై దాడి అమానుషం

by velandi.Saikiran |

కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఓరుగంటి నరేష్ గౌడ్ పై కొందరు దుండగులు దాడి చేసి తీవ్ర

డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పై దాడి అమానుషం
X

దిశ, కోదాడ : కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఓరుగంటి నరేష్ గౌడ్ పై కొందరు దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరచరడాన్ని డివిజన్ గౌడ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మండవ ఉపేందర్ ప్రధాన కార్యదర్శి కొండా శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ఆదివారం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నరేష్ ని పరామర్శించి దాడి ఏ విధంగా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఇట్టి చర్య హేయమైనదని బాధితునకు వెంటనే న్యాయం చేయాలని సంబంధిత అధికారులను కోరారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Next Story