వానాకాలం వచ్చింది.. జర భద్రం.. పాముకాటుకు గురై వృద్దురాలు మృతి

by Bhanu |   (  Updated:2025-06-26 15:20:00  IST  )

మండలంలోని బోగారం గ్రామానికి చెందిన గట్టు చంద్రమ్మ (75) పాముకాటు గురై మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది.

వానాకాలం వచ్చింది.. జర భద్రం.. పాముకాటుకు గురై వృద్దురాలు మృతి
X

దిశ, రామన్నపేట : మండలంలోని బోగారం గ్రామానికి చెందిన గట్టు చంద్రమ్మ (75) పాముకాటు గురై మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం ఇంటి పక్కన చెట్టు వద్ద కూర్చుని ఉండగా చెట్టు పైనుండి పాము వృద్ధురాలిపై పడి కాటు వేసింది. చుట్టుపక్కల వాళ్ళు చూసి వెంటనే రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చంద్రమ్మ మృతి చెందారు.

Next Story