నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ను ఆదర్శ కార్పొరేషన్ చేసేందుకు కృషి చేయాలి : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా నియామకమైన శరత్ చంద్ర ఇవాళ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ను ఆదర్శ కార్పొరేషన్ చేసేందుకు కృషి చేయాలి : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
X

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా నియామకమైన శరత్ చంద్ర ఇవాళ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపారు. నూతన కార్పొరేషన్ అభివృద్ది కోసం ప్రణాళికాబద్ధంగా పని చేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని నూతన కమిషనర్ కు మంత్రి సూచించారు. ఎన్నో ఏళ్ల తర్వాత కార్పొరేషన్ సాధించుకున్నామని, మౌళిక సదుపాయాల కల్పనలో అగ్రగామి నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ అనే విధంగా కష్టపడి పని చేయాలన్నారు. వేల కోట్లతో ఇప్పటికే నల్లగొండ పట్టణంలో చేసిన అభివృద్ది పనులు, ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనులు వివరించారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంలో భాగం కావాలని చెప్పారు. సూపర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి నినాదంతో వెళ్తున్నామని అందుకు అనుగుణంగా పారదర్శకంగా పని చేయాలని మంత్రి నూతన కమిషనర్ శరత్ చంద్ర కు సూచించారు.

Next Story