- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరం
మద్యం మత్తులో వాహనాలను నడపడం ప్రమాదకరమని అది నేరం కూడా అని పాలకవీడు ఎస్సై ఆర్ కోటేష్ అన్నారు.

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు) : మద్యం మత్తులో వాహనాలను నడపడం ప్రమాదకరమని అది నేరం కూడా అని పాలకవీడు ఎస్సై ఆర్ కోటేష్ అన్నారు. అరైవ్ - అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం పాలకవీడు పోలీసుల ఆధ్వర్యంలో జాతీయ రహదారి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై కోటేష్ వాహనదారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. మద్యం మత్తులో వాహనాలను నడపరాదని వాహనాలు నడపడం వలన ప్రమాదాలు జరిగా అవకాశం ఉందని అన్నారు. వాహనాలు నడిపేటప్పుడు మద్యం మత్తు వల్ల ఎదుటివారి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసులు చెప్పిన నిబంధనలు పాటించాలన్నారు. నిత్యం మద్యం మత్తు తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. వాహనదారులు మద్యం మత్తులో పట్టుబడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.






