రియల్ డబుల్ దందా..!

by Ajay Maddhiboyina |

యాదగిరి గుట్ట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫామ్ ల్యాండ్ "ప్లాట్ల" డబుల్ రిజిస్ట్రేషన్ల దందా జోరుగా కొనసాగుతుంది. ధరణి, భూభారతి పోర్టల్ రాకముందుకు రియల్ వ్యాపారులు అనధికార వెంచర్లు చేసి యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్లాట్లు గా విక్రయించారు.

రియల్ డబుల్ దందా..!
X

దిశ,ఆలేరు : యాదగిరి గుట్ట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫామ్ ల్యాండ్ "ప్లాట్ల" డబుల్ రిజిస్ట్రేషన్ల దందా జోరుగా కొనసాగుతుంది. ధరణి, భూభారతి పోర్టల్ రాకముందుకు రియల్ వ్యాపారులు అనధికార వెంచర్లు చేసి యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్లాట్లు గా విక్రయించారు. ధరణి,భూభారతి వచ్చిన తర్వాత అవే భూములకు తహశీల్దార్లు పాస్ బుక్ లు పొందారు. పాస్ బుక్ లో వున్న విస్తీర్ణాల కంటే అధికంగా భూమిని ఇష్టారాజ్యంగా ఎక్కించారు.పాస్ బుక్ లో ఉన్న భూమిని బట్టి "నాలా" సర్టిఫికెట్లు జారీ చేయడం మూలంగా సబ్ రిజిస్టార్లు డబుల్ రిజిస్ట్రేషన్ల తో పాటు ఒక్కొక్క నాలా సర్టిఫికెట్ ఆధారంగా రెండు నుంచి మూడుసార్లు అంతకుమించి అనేక సార్లు ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేస్తూ అక్రమ "దందా" కొనసాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

2.20ఎకరాలభూమికి 16,156 గజాలు ప్లాట్లుగా రిజిస్ట్రేషన్లు

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామ రెవెన్యూ శివారులోని సర్వే నెంబర్ లోని 2.20 ఎకరాల భూమిని ఒక మహిళ రైతు వద్ద డాక్యుమెంట్ నెంబర్ 14933/2020, ద్వారా 1.20 ఎకరాలు, డాక్యుమెంట్ నంబర్ 9324/20 ద్వారా 1.00 ఎకరం మొత్తం 2.20 ఎకరాలు ఎం ఎస్ విజన్ ఫ్రైడ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ యజమాని తుమ్ములూరి సంతోష్ కుమార్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కొనుగోలు చేసి డాక్యుమెంట్లను ఆలేరు తహశీల్దార్ కార్యాలయంలో మ్యూటేషన్ చేసుకోకుండానే డాక్యుమెంట్ నెంబర్ల ఆధారంగా 2021ఏప్రిల్ 15 నుంచి 2021సెప్టెంబర్ 22 వరకు యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం లో మొత్తం 49 ప్లాట్లు చొప్పున మొత్తం 7567 గజాలు విక్రయించాడు. ధరణి వచ్చిన అనంతరం ఆలేరు రెవెన్యూ అధికారులు తిరిగి 2.20 ఎకరాల కు ధరణిలో మ్యూటేషన్ చేసి నూతనపాస్ బుక్ లు జారీ చేసి 1.04 ఒక్కొక్క గుంట చొప్పున మొత్తం 44 నాలా ధ్రువపత్రాలకు మొత్తం (86) జారీ చేశారు.అంటే అదనంగా మరో 42 నాలా ధ్రువపత్రాలు జారీ చేశారన్నమాట దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 86 నాలా ధ్రువపత్రాలు ఆధారంగా 71 ప్లాట్లు గా యాదగిరి గుట్ట సబ్ రిజిస్టార్లు మొత్తం 8,712 గజాలు డబుల్ రిజిస్ట్రేషన్లు చేశారు.

రూ.4.32 కోట్లు కొట్టేసిన రియల్ వ్యాపారి

రియల్ వ్యాపారి తుమ్మలూరి సంతోష్ కుమార్ తాను కొనుగోలు చేసిన 2.20 ఎకరాలలో గతంలో మొత్తం 120 ప్లాట్లుగా 16.వేల 156 గజాలు విక్రయాలు జరిపాడు. దీంతో అదనంగా 8, వేల 650 గజాలు విక్రయించి ఒక్కొక్క గజానికి రూ 5వేల చొప్పున పేద అమాయక ప్రజలకు ప్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్ చేసి సుమారు మొత్తం రూ.4.32 కోట్లు ప్రజల సొమ్ము ను దోచుకున్నాడు. రియల్ వ్యాపారి సంతోష్ కుమార్ మోసాలకు ఆలేరు రెవెన్యూ, యాదగిరి గుట్ట సబ్ రిజిస్టార్ అధికారులు అవినీతి అక్రమాల్లో పోటీపడి పరోక్షంగా, కారణమయ్యారు. ఈ రెండు శాఖ లా అధికారుల అవినీతి అక్రమాలపై ఏసీబీ,జిల్లా కలెక్టర్, విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి బాధ్యులైన ఆలేరు రెవిన్యూ, సబ్ రిజిస్ట్రర్ల లపై చర్యలు తీసుకొని రియల్ వ్యాపారి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆలేరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు .

ఒక్కొక్క ప్లాట్ కు రూ.3నుంచి రూ.5వేలు వసూళ్లు ?

తహసీల్దారులు జారీ చేసిన నాలా ధ్రవపత్రాల ఆధారంగా యాదగిరి గుట్ట సబ్ రిజిస్ట్రేషన్ అధికారులు ప్లాటుగా రిజిస్ట్రేషన్ చేయాలంటే రియల్ వ్యాపారుల నుంచి ఒక్కొక్క ప్లాటుకు మూడు నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే అదునుగా భావించిన రియల్ వ్యాపారులు ఒక్కొక్క నాలా సర్టిఫికెట్ మీద రెండు నుంచి మూడుసార్లు డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తు ప్రజలను మోసం చేస్తున్నారు.

Next Story