- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సబ్సిడీ గ్యాస్ పక్కదారి.. వ్యాపార అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లు
గృహ అవసరాలకు వినియో గించాల్సిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు పోచంపల్లి మండలంలో పక్కదారి పడుతున్నాయి.

దిశ, భూదాన్ పోచంపల్లి: గృహ అవసరాలకు వినియో గించాల్సిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు పోచంపల్లి మండలంలో పక్కదారి పడుతున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు అందించే సబ్సిడీ వంటగ్యాస్ ను కొంతమంది వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్లో కొనుగోలు చేసి తమ వ్యాపారానికి వినియోగిస్తున్నారు. దీంతో పట్టణంలోని ఫాస్ట్ ఫుడ్, టిఫిన్ సెంటర్లు, టీకొట్లు, బిరియాని సెంటర్లలో ఏ హోటల్లో చూసినా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లే దర్శనమిస్తున్నాయి. నిబంధనలు తుంగ లో తొక్కి నిర్భయంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాడుతున్న పట్టించుకునే నాథుడే లేడు. కళ్లెదుటే గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా జోరుగా సాగుతున్న పట్టించుకోవాల్సిన సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తూ మామూళ్ల మత్తులో మునిగిపోయారనే విమర్శలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.
కమర్షియల్ సిలిండర్ల గ్యాస్ ధరతో పోల్చితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు కొంత తక్కువ ధరకు వస్తుండడంతో వ్యాపారులు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల వైపే మొగ్గు చూపుతున్నారు. డెలివరీ బాయ్లె ప్రధాన సరఫరాదారులుగా ఉంటూ ఒక్కో సిలిండర్కు రూ.200 నుంచి రూ.400 ల వరకు అదనంగా తీసుకుని సిలిండర్ ఇస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వ్యాపార అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు విచ్చలవిడిగా వినియోగిస్తున్న సంబంధిత అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ దందాను జోరుగా నిర్వహించే గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్లను సరఫరా చేయడానికి వినియోగిస్తున్న వాహనాలకు గ్యాస్ ఏజెన్సీ పేరు లేకుండా నడుపుతుండడం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.






