రాయ‌గిరి రైతుల‌ను బలి చేయొద్దు : ఎమ్మెల్సీ క‌విత

by Nallavelli.Anjaneyulu |

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : రాయ‌గిరి రైతుల‌ను బ‌లి చేయ‌వ‌ద్ద‌ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు.

రాయ‌గిరి రైతుల‌ను బలి చేయొద్దు :  ఎమ్మెల్సీ  క‌విత
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : రాయ‌గిరి రైతుల‌ను బ‌లి చేయ‌వ‌ద్ద‌ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు. మంగళవారం జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరిలో త్రిబుల్ ఆర్ నిర్వాసిత రైతులతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆమె రైతుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే పలు మార్లు అనేక ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన రాయగిరి రైతులను మళ్లీ ట్రిపుల్ ఆర్ కోసం భూములు తీసుకొని బలి చేయొద్దని తెలిపారు. గతంలో త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ జరిగినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీ గా ఉన్నానని ఆ సమయంలో రైతులకు బేడీలు వేసి జైల్లో బంధించినందుకు నన్ను క్షమించాలని రైతులను కోరారు. రైతులకు బేడీలు వేసి కేసులు పెట్టి వేధించడం దుర్మార్గమైన చర్య అన్నారు. పలుమార్లు అలైన్మెంట్ మారుస్తున్నప్పటికీ రైతులకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ఎయిమ్స్ నిర్మాణం 2014 నుండి జరిగినప్పటికీ ఇప్పటికీ ఎమర్జెన్సీ సేవలు అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిమ్స్ లో అత్యవసర సేవలు మెరుగుపరచడం ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దు జిల్లాలతో పాటు వేలాది మంది పేదలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ తో మాట్లాడి పనులపై అడిగి తెలుసుకున్నామన్నారు. జిల్లా మంత్రి చొరవ తీసుకొని ఎయిమ్స్ నిర్మాణ పనులలో కాంట్రాక్టర్ తో మాట్లాడి త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Next Story