రోడ్డుపక్కన వాహనాలు పార్క్ చేయొద్దు : ఎస్పీ శరత్ చంద్ర పవార్

by Ratna Kumari |   (  Updated:2025-12-04 15:49:34  IST  )

దిశ, నల్లగొండ క్రైం : చలికాల తెల్లవారాక ఏర్పడే దట్టమైన పొగమంచుతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తెల్లవారుజామున, ఆ తర్వాత కూడా అతి జగ్రత్తగా వాహనాలు నడిపితే

రోడ్డుపక్కన వాహనాలు పార్క్ చేయొద్దు : ఎస్పీ శరత్ చంద్ర పవార్
X

దిశ, నల్లగొండ క్రైం : చలికాల తెల్లవారాక ఏర్పడే దట్టమైన పొగమంచుతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తెల్లవారుజామున, ఆ తర్వాత కూడా అతి జగ్రత్తగా వాహనాలు నడిపితే దీని నుంచి బయటపడే అవాకాశం ఉన్నది. మంచులో అజాగ్రత్తగా వాహనాలు నడిపే వారికే కాకుండా, ముందున్న వాహనదారులు కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పాదచారులు, జంతువులు, సిగ్నల్స్ సరిగ్గా దగ్గర కనిపించవు. ఈ సమయంలో ముందున్న వాహనాలు, ఆగి ఉన్న వాహనాలు ఎంత దూరం ఉన్నాయో అంచనావేయడం కష్టం అవుతుంది. రోడ్డువెంట వాహనాలు పార్క్ చేయడం, చెడిపోయిన వాహనాలతో భారీ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నది. ఈ చలికాలంలో డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చనని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచిస్తున్నారు.


  • గమ్యస్థానానికి వెళ్లాల్సిన క్రమంలో కొద్దిగా ముందుగానే బయలుదేరండి. పొగమంచుతో ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది కనుక ముందుగా బయలుదేరితే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తొందరగా వెళ్లాలనే ఆలోచనను నివారించవచ్చు.
  • అతివేగం, ఓవర్ టేకింగ్ చేయొద్దు. ముందుగా ఉన్న వాహనాలు, రోడ్డుపై కనిపించకపోవడంతో వేగంగా వెళ్లడంతో వాహనం కంట్రోల్ తప్పే ప్రమాదం ఉంది. ఓవర్ టేకింగ్ వలన ముందున్న వాహనం ఎంత దూరంలో ఉందో అంచనావేయడం కష్టమవుతోంది.
  • లోబీమ్ లైట్లను వాడండి. పొగ మంచు వలన హై బీమ్ లైట్ల నుంచి వచ్చే కాంతి విచ్ఛిన్నమై ముందు చూడడం కష్టం అవుతుంది. లోబీమ్ లైట్లు ఉండటంతో వెనుక లైట్లు, మిగతా వాహనదారులకు క్లియర్ గా మీ వాహనం ఎంత దూరంలో ఉందో తెలుస్తుంది. ఫాగ్ లైట్లు ఉన్న యెడల, వాటిని వాడితే మంచిది.
  • ముందు ఉన్న వాహనానికి మీ వాహనానికి మధ్య సురక్షిత దూరం పాటించాలి. మంచులో కనీసం 50 నుంచి 100 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. దీంతో ముందున్న వాహనం సడన్ బ్రేక్ వేసినా, వాహనం ఎక్కడ ఉందో అంచనా వేయడంలో తప్పు జరిగినా, ముందున్న వాహనాన్ని ఢీకొట్టడాన్ని నివారించవచ్చు. వీలైనంత వరకు రోడ్డు పక్కన వాహనాలను ఆపవద్దు. అత్యవసరమైతే, వాహనాన్ని సురక్షితమైన ప్రదేశంలో ఆపి, రిఫ్లెక్టర్లను ఉపయోగించండి.
  • నిర్దేశించబడిన లేన్లలో వాహనాన్ని నడపండి. ఇష్టం వచ్చినట్లు లేన్ క్రమశిక్షణ లేకుండా నడపడం వలన ముందున్న వాహనాలను గుర్తించడం కష్టం అవుతుంది.
  • వాహనాన్నినడిపేటప్పుడు కొద్దిగా కిటికీ అద్దాలను దించండి. దీని ద్వారా పొగమంచు ఒకేదగ్గర కేంద్రీకృతం కాకుండా విచ్ఛిన్నం అవుతుంది. దాని వలన డ్రైవర్ దృష్టి మెరుగు పడుతుంది.
  • కొన్నిసార్లు పొగమంచు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో కాసేపు వాహనాన్ని ఆపి మరల వాహనాన్ని నడపండి. మీకు ముందు ఉన్న వాహనాలు, రోడ్డు సరిగ్గా కనిపించకపోతే వాహనాన్ని నడపవద్దు. లేనియెడల ముందున్న వాహనం ఎంతదూరం ఉందో అంచనా వేయడం కష్టం. గమ్యస్థానానికి వెళ్ళే తొందరలో తప్పులు చేయవద్దు.
  • మీ వాహనం ముందు కిటికీ అద్దాలను వెనుక ఉన్న అద్దాలను శుభ్రంగా ఉంచుకోండి. పొగమంచు అద్దాలను కవర్ చేయడంతో దృష్టి తగ్గుతుంది. మీ వాహనం యొక్క వైపర్లను, డీప్రాస్టర్లను అవసరాన్ని బట్టి వాడుతూ అద్దాలను క్లియర్ గా ఉంచండి.
  • ముందుగా ఇన్డికేటర్లను ఉపయోగించండి. మీరు ఎటువైపు వెళుతున్నారో వెనుక వచ్చే వాహనానికి ముందుగా తెలిసేటట్లు జాగ్రత్త తీసుకోండి. లేకుంటే వెనుక వచ్చే వాహనం ముందున్న వాహనం ఎటు వెళుతుందో అంచనావేయడంలో తప్పు చేయవచ్చు. వెనుక వచ్చే డ్రైవర్లకు కొంత సమయం ఉండేటట్లు ఇండికేటర్లతో సిగ్నల్ ఇవ్వాలి.
  • సడన్ బ్రేకింగ్ వేయడాన్ని నివారించండి. చలికాలంలో రోడ్డు తడిగా ఉండటంవలన వాహనాలు స్కిడ్ అవడం, స్లిప్ అవ్వడం జరుగుతుంది. నిర్దిష్ట స్పీడ్ తో వాహనాలను నడపడం వలన, స్లిప్పరీ రోడ్ల నుంచి వాహనాలు స్కిడ్ కాకుండా నివారించవచ్చు. సడన్ బ్రేక్ లు వేయడం వలన స్లిప్పరీ రోడ్ మీద వాహనం అదుపు తప్పేప్రమాదముంది. అందుచేత బ్రేక్ లను నెమ్మదిగా వేయాలి.
Next Story