- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దీపావళి దోపిడీ.. లైసెన్స్ లేకుండా, పన్నులు చెల్లించకుండా వ్యాపారం
దీపావళి అంటే పటాకుల పండుగ. అది వస్తే చాలు అందరికీ ఆనందమే. ప్రతీ ఒక్కరూ పటాకులు కొని ఇళ్ల ముందు కాల్చేందుకు సిద్ధమవుతారు.

దీపావళి అంటే పటాకుల పండుగ. అది వస్తే చాలు అందరికీ ఆనందమే. ప్రతీ ఒక్కరూ పటాకులు కొని ఇళ్ల ముందు కాల్చేందుకు సిద్ధమవుతారు. ఇదే అదనుగా పటాకులను అధిక ధరలకు విక్రయిస్తూ కొందరు దందా షురూ చేశారు. ఈ క్రమంలో అధికారులు కూడా ధరల విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో వ్యాపారులు ఇష్టానుసారంగా రేట్లు ముద్రించి 50శాతం రాయితీ అంటూ ప్రజలను మోసం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో సాధారణ, మధ్య తరగతి వారికి దీపావళి పటాకులు కొనుగోలు భారంగా మారుతోంది. అధిక ధరలపై వ్యాపారులను ప్రజలు ప్రశ్నించగా మేము సంబంధిత అధికారులకు మామూళ్లు ఇవ్వాలని బహిరంగంగానే చెప్తుండడం గమనార్హం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.4కోట్ల పైచిలుకు వ్యాపారం జరుగుతుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో పన్ను చెల్లించకుండా వ్యాపారం నిర్వహిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. కొందరికి పెద్దమొత్తంలో మామూళ్లు ముడుతున్నాయన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
దిశ, సూర్యాపేట : పటాకుల పండుగ దీపావళి వస్తే చాలు అందరికీ ఆనందమే. ప్రతీ ఒక్కరూ పటాకులు కొని ఇళ్ల ముందు కాల్చేందుకు సిద్ధమవుతారు. కానీ ఇదే అదనుగా పటాకులను అధిక ధరకు అమ్ముకునేందుకు కొందరు అక్రమార్కులు దందా షురూ చేశారు. ఈ క్రమంలో అధికారులు కూడా ధరల విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో వ్యాపారులు ఇష్టానుసారంగా రేట్లు ముద్రించి 50శాతం రాయితీ అంటూ ప్రజలను మోసం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో సాధారణ, మధ్య తరగతి వారికి దీపావళి పటాకులు కొనుగోలు భారంగా మారుతోంది.
హోల్ సేల్ పేరుతో...
జిల్లా కేంద్రంలోని ఎన్‌హెచ్ 365 హైవే రోడ్డు పక్కన 365 రోజుల పేరుతో అయ్యప్ప ఫైర్ వర్క్ దుకాణదారుడు ఇష్టారాజ్యంగా రేట్లు వేస్తూ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నాడని బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. సంబంధిత శాఖలకు ఇప్పటికే ముడుపులు ముట్టాయని ఆరోపణలు ఉన్నాయి. ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజీలో 56 దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇష్టారాజ్యంగం రేట్లు వేస్తూ ప్రజలను పిక్కు తింటున్నారని విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇవేం రేట్లనే ప్రజలు ప్రశ్నించగా మేము సంబంధిత కొంతమంది అధికారులకు మామూళ్లు ఇవ్వాలని బహిరంగంగానే చెప్తుండడం గమనార్హం.
ఏటా రూ.4కోట్లపైనే వ్యాపారం..
సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.4కోట్ల పైచిలుకు వ్యాపారం జరుగుతుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. దీపావళి సందర్భంగా మూడురోజుల్లోనే రూ.3కోట్ల నుంచి రూ.4కోట్ల వరకు అమ్మకాలు సాగుతాయి. పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు, వేడుకల సందర్భంలో రూ.కొటీకి పైగానే పటాకులు విక్రయిస్తుంటారు. పన్ను చెల్లించకుండా వ్యాపారం నిర్వహిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. కొందరికి పెద్దమొత్తంలో మామూళ్లు ముడుతున్నాయన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది 56దుకాణాలకు దరఖాస్తులు చేసుకోగా అనుమతులు ఇచ్చారు. గతంలో పాత మార్కెట్‌లో దుకాణాలకు అనుమతిచ్చేవారు. రెండు సంవత్సరాల నుంచి ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజీలో షాపులకు అనుమతి ఇస్తున్నారు. దీంతో పటాకుల వ్యాపారులు షెడ్ల నిర్మాణాలను పూర్తి చేసుకుంటున్నారు. ఇవే కాకుండా జిల్లాలో పటాకుల విక్రయానికి సంబంధించి ఎంత మందికి రెగ్యులర్ లైసెన్స్ ఉందనే ప్రశ్నకు అధికారుల వద్ద కూడా సమాధానం లేదు. వివిధ ప్రాంతాలనుంచి తెచ్చిన పటాకుల్లో 80శాతం బిల్లులు లేకుండా వ్యాపారం చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంపై దృష్టి సారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.






