శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు : సీఐ చరమందరాజు

by Ratna Kumari |

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించే లేదని చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వ్యక్తులపై రౌడీ షీట్ నమోదు చేస్తామని హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు అన్నారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు : సీఐ చరమందరాజు
X

దిశ, హుజూర్ నగర్ : శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించే లేదని చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వ్యక్తులపై రౌడీ షీట్ నమోదు చేస్తామని హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు అన్నారు. జనవరి 1 రాత్రి సమయంలో హుజూర్ నగర్ పట్టణంలోని కొందరు వ్యక్తులు రెండు వర్గాలుగా ఏర్పడి ఒకరిపై ఒకరు దాడులు దాడులు చేసుకొని శాంతి భద్రత విఘాతం కలిగించారు. ఆ వ్యక్తులపై కేసు నమోదు చేశారు. శుక్రవారం ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులను హుజూర్ నగర్ సీఐ కార్యాలయానికి పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందున కేసు నమోదు అయిందని ఎటువంటి వివాదాలలోకి వెళ్లకుండా ఉండేందుకు ముందస్తుగా ఆర్డీఓ వి . శ్రీనివాసులు ఎదుట హాజరు పరిచి రూ. 5 లక్షల పుచికత్తుతో బైండోవర్ చేసి సత్ప్రవర్తతో ఉండాలని సూచించినట్లు తెలిపారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని హుజూర్ నగర్ నేరేడుచర్ల పట్టణాలలోని గతంలో గంజాయి కేసులో నమోదైన వ్యక్తులు రౌడీ షీటర్లు సస్పెక్ట్ షీట్లు ఉన్న వ్యక్తులపైన నిరంతరం నిఘా పెడుతున్నామన్నారు. ఒకటి లేదా అంత కంటే ఎక్కువ కేసులు ఉండి నేరాలలో పాల్గొన్న వ్యక్తులపై రౌడీ షీట్లు లను ఓపెన్ చేస్తామన్నారు. తాగిన మత్తులో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హుజుర్ నగర్ నేరేడుచర్ల పట్టణ ప్రజలు శాంతి భద్రతలు కాపాడుటలో పోలీసువారికి సహకరించగలరని కోరారు. ఆయన వెంట హుజూర్ నగర్ ఎస్సై బి. మోహన్ బాబు ఉన్నారు.

Next Story