వాస్త‌వాల‌ను చేర‌వేయ‌డంలో "దిశపత్రిక" ముందుంటుంది : జాలె న‌ర్సింహారెడ్డి

by Nallavelli.Anjaneyulu |

వాస్తవాలను నిర్భయంగా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికితీస్తూ, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తుంది 'దిశ దిన ప‌త్రిక' అని పీసీసీ స‌భ్యులు, పీఏసీఎస్ చైర్మ‌న్ జాలే న‌ర్సింహారెడ్డి పేర్కొన్నారు.

వాస్త‌వాల‌ను చేర‌వేయ‌డంలో దిశపత్రిక ముందుంటుంది : జాలె న‌ర్సింహారెడ్డి
X

దిశ, చందంపేట : వాస్తవాలను నిర్భయంగా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికితీస్తూ, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా తన దైన శైలిలో వార్తలు రాస్తూ నిలుస్తుంది దిశ దిన ప‌త్రిక అని పీసీసీ స‌భ్యులు, పీఏసీఎస్ చైర్మ‌న్ జాలే న‌ర్సింహారెడ్డి పేర్కొన్నారు. దిశ క్యాలెండ‌ర్ ను ఆయ‌న JPR Infra Pvt Managing డైరెక్టర్, జాలే తిలక్ రెడ్డితో క‌లిసి ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ దిశ దిన ప‌త్రిక అన‌తికాలంలోనే ప్ర‌జ‌ల మ‌న్న‌న‌ల‌ను చూర‌గొన్న‌ద‌ని తెలిపారు. ప్రజల సమస్యలను సూటిగా అధికారుల, పాలకుల దృష్టికి తీసుకువెళ్లడంలో తన దైన శైలితో వార్తలు రాస్తున్నా "దిశ" పత్రిక ప్రత్యేక ముద్రతో ముందుందని వారు పేర్కొన్నారు. అనతి కాలంలోనే డిజిటల్ రంగంలో ప్రజల పక్షాన నెంబర్ వన్ గా నిలిచే పత్రిక అన్నారు. ఎప్పటి వార్తలు అప్పుడు, వాస్తవాలను నిర్భయంగా ప్రజలకు అందించడంలో "దిశపత్రిక" నెంబర్ వన్ స్థానంలో ముందు ఉందని వారు ప్రశంసించారు. ప్రారంభమైన కొద్ది కాలంలోనే పత్రికకు లభించిన ప్రజాదరణ పత్రిక విశ్వసనీయతకు నిదర్శనమని తెలిపారు. ప్రజల గుండెల్లో "దిశపత్రిక" నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రస్ యువ నాయకులు ఇప్ప ప్రవీన్ కుమార్ రెడ్డి, రిపోర్టర్ నల్ల చెన్నయ్య పాల్గొన్నారు.

Next Story