ఇన్వెస్టిగేటివ్ వార్త‌లు అందించ‌డంలో దిశ టాప్ : ఎస్పీ అక్షాంశ్ యాద‌వ్

by Nallavelli.Anjaneyulu |

ఇన్వెస్టిగేటివ్ వార్తలు అందించడంలో దిశ దిన పత్రిక టాప్ లో ఉంటుందని యాదాద్రి ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో దిశ దిన పత్రిక 2026 క్యాలెండర్ ఆవిష్కరించారు.

ఇన్వెస్టిగేటివ్ వార్త‌లు అందించ‌డంలో దిశ టాప్ : ఎస్పీ అక్షాంశ్ యాద‌వ్
X

దిశ‌, యాదాద్రి క‌లెక్ట‌రేట్ : ఇన్వెస్టిగేటివ్ వార్తలు అందించడంలో దిశ దిన పత్రిక టాప్ లో ఉంటుందని యాదాద్రి ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో దిశ దిన పత్రిక 2026 క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డైనమిక్ ఎడిషన్ల ద్వారా ఎప్పటి వార్తలు అప్పుడే అందిస్తూ డిజిటల్ రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. పారదర్శకమైన వార్తలు అందిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పని చేయాలని సూచించారు. వార్తల్లో క‌చ్చితత్వం పాటిస్తూ దిశ అందించే వార్తలు మిగతా పత్రికలకు భిన్నంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్టాఫర్ మహేష్, రిపోర్టర్ గుండె బాబు పాల్గొన్నారు.

Next Story