దిశ ఎఫెక్ట్ : ఎంజీ నగర్ తండా పాఠశాలను సందర్శించిన ఎంఈఓ..

by Bhanu |

'ప్లీజ్ సార్ మరుగుదొడ్లు కట్టించండి!' అనే కథనం దిశ పత్రికలో ప్రచురించడం జరిగింది. దిశ కథనానికి స్పందించిన జిల్లా

దిశ ఎఫెక్ట్ : ఎంజీ నగర్ తండా పాఠశాలను సందర్శించిన ఎంఈఓ..
X

దిశ, చివ్వేంల : 'ప్లీజ్ సార్ మరుగుదొడ్లు కట్టించండి!' అనే కథనం దిశ పత్రికలో ప్రచురించడం జరిగింది. దిశ కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, మండల అధికారులకు వెంటనే ఎంజీ నగర్ తండాలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని తెలిపినట్లు సమాచారం.

గురువారం మండల విద్యాధికారి కళారాణి పాఠశాలను సందర్శించారు. కలెక్టర్ వెంటనే ఎం జి నగర్ తండాలోని పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించాలని తెలియజేసినట్లు ఆమె తెలిపారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన దిశ యాజమాన్యానికి పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తండా ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు..

Next Story