- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > పత్రిక రంగంలో "దిశ" నూతన ఒరవడి సృష్టించింది : సీఐ మన్మధకుమార్
పత్రిక రంగంలో "దిశ" నూతన ఒరవడి సృష్టించింది : సీఐ మన్మధకుమార్
దిశ, చౌటుప్పల్ : పత్రికా రంగంలో దిశ నూతన ఒరవడిని సృష్టించిందని చౌటుప్పల్ సీఐ మన్మధకుమార్ అన్నారు.

X
దిశ, చౌటుప్పల్ : పత్రికా రంగంలో దిశ నూతన ఒరవడిని సృష్టించిందని చౌటుప్పల్ సీఐ మన్మధకుమార్ అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్ లో దిశ పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను సీఐ మన్మధ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పత్రికా రంగంలో డిజిటల్ మీడియా రంగంలో దిశ ఒక ప్రభంజనాన్ని సృష్టించిందని అభిప్రాయపడ్డారు. అత్యంత వేగంగా విశ్వసనీయతతో వార్తలు అందించడంలో దిశ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని అన్నారు. జర్నలిజం విలువలను కాపాడుతూ అనతి కాలంలోనే ఎంతో మంది పాఠకుల అభిమానాన్ని చూరగొన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో దిశా మునుగోడు నియోజకవర్గ ఇన్ చార్జి చిలువేరు సంజీవ, రిపోర్టర్ కొయ్యడ స్వామి గౌడ్, ఎస్సైలు నర్సిరెడ్డి, ఉపేందర్ రెడ్డి, అజయ్ భార్గవ్, రమేష్, ఏఎస్ఐ కరుణాకర్ పాల్గొన్నారు.
Next Story






