విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనం దిశ దిన పత్రిక

by Bhoopathi Nagaiah |

తెలుగు రాష్ట్రాల్లో బహుళ ప్రాచుర్యం పొందిన దిశ దిన పత్రిక క్యాలెండర్లను పెన్‌పహాడ్ మండలంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఆవిష్కరించి, ప్రశంసించారు.

విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనం దిశ దిన పత్రిక
X

దిశ, పెన్‌పహాడ్: వాస్తవాలను నిర్భయంగా, నిఖార్సుగా ప్రచురించడంలో దిశ దినపత్రికకు ప్రత్యేక స్థానం ఉందని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లోనూ సత్యాన్ని నిర్భయంగా, నిఖారుగా అందించే మాధ్యమంగా దిశ దినపత్రిక ప్రత్యేక గుర్తింపు పొందిందనిపెన్‌పహాడ్ మండల తహసీల్దార్ లాలు నాయక్, పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కాస్తాల గోపికృష్ణ అన్నారు. దిశ దినపత్రిక 2026 క్యాలెండర్‌ను వారిద్దరు వేర్వురుగా ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణలో తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, స్పోర్ట్స్, ఉద్యోగ అవకాశాలు తదితర అంశాల్లో ప్రజల నమ్మకానికి నిలువెత్తుగా దిశ ఉందని వారు కొనియాడారు. పత్రికా రంగంలో తనదైన శైలితో ప్రత్యేక ముద్ర వేసుకుని, కొద్ది కాలంలోనే డిజిటల్ రంగంలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించిన దిశ – ప్రింట్, డిజిటల్ రెండు రూపాల్లోనూ అద్భుత విజయం సాధిస్తోందని ప్రశంసించారు.

ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు దిశకు మరింత గుర్తింపు, సన్నిహితత్వం తెచ్చిపెడుతున్నాయన్నారు. అదేవిధంగా ఇది దిశకు విస్తృత పాఠక వర్గం, విశ్వసనీయతను గ్రామ స్థాయి అధికారులు కూడా గుర్తిస్తున్నట్లు సూచిస్తోంది. తెలంగాణలో వేడి వేడి తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, స్పోర్ట్స్, ఉద్యోగాలు తదితర అంశాల్లో దిశ ఎప్పుడూ తెలంగాణ ప్రజలకు నమ్మకమైన సమాచార వనరుగా నిలుస్తోందని ఆయన తెలిపారు. అదే విధంగా చివ్వెంల మండల పరిధిలోని గుంజలూరులో సర్పంచ్ బొల్లికొండ సైదులు దిశ 2026 క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. వార్తలను పక్షపాతం లేకుండా అందిస్తూ... ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రాధ, ఆర్‌ఐ అజీజ్, సునీత, పుష్పలత, కానిస్టేబుల్స్ సైదులు, శ్రావణ్, రమేష్, గుంజలూరు ఉపసర్పంచ్ దొనకొండ పావని మహేష్, 5వ వార్డు మెంబెర్ కొప్పు సైదులు, మాజీ ఉప సర్పంచ్ పెద్ది అంజయ్య, ఎక్కటి శ్యామసుందర్ రెడ్డి, బచ్చు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story