- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ ఘాతంతో పాడి గేదె మృతి
by Bhanu |
ప్రమాదవశత్తు విద్యుత్ ఘాతంతో పాడి గేదె మృతి చెందిన ఘటన ఆదివారం కనగల్లు మండలంలోని ధర్వేశిపురం గ్రామంలో చోటుచేసుకుంది.

X
దిశ, కనగల్లు: ప్రమాదవశత్తు విద్యుత్ ఘాతంతో పాడి గేదె మృతి చెందిన ఘటన ఆదివారం కనగల్లు మండలంలోని ధర్వేశిపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సింగం మల్లికార్జున్ కు చెందిన ఒక పాడి గేదే రోజు మాదిరిగా మేతకు వెళ్లగా గ్రామ శివారులో గల పాలకూరి పుల్లయ్య పొలంలో విద్యుత్ వైర్లు జంపుగా ఉండి వేలాడుతునడంతో ఆ రైతు కర్రల సహాయంతో వైర్లను పైకి ఎత్తి పెట్టాడు.
గేదమేస్తున్న సమయంలో తీగలకు సపోర్టుగా పెట్టిన కర్ర ఊడిపోవడంతో కరెంటు వైర్లు గేద మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. వీటి విలువ రూ. ఒక లక్ష వరకు ఉంటుందని ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని వారు కోరారు.
Next Story






