- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి ముందు ధర్నా.
రాష్ట్ర ప్రభుత్వం ప్రి ప్రైమరీ, పీఎం శ్రీవిద్యను అంగన్వాడి కేంద్రాలలో నిర్వహించాలని అలాగే అంగన్వాడీ ఉద్యోగు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు. శ్రామిక మహిళ కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి ముందు ధర్నా.
- ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి
- అంగన్వాడీ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు
దిశ హుజూర్ నగర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రి ప్రైమరీ, పీఎం శ్రీవిద్యను అంగన్వాడి కేంద్రాలలో నిర్వహించాలని అలాగే అంగన్వాడీ ఉద్యోగు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు. శ్రామిక మహిళ కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అంగన్వాడీ ఉద్యోగుల సమస్య పరిష్కారంకై సోమవారం హుజూర్ నగర్ పట్టణంలోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటిముందు ధర్నా నిర్వహించి మాట్లాడారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఐసీడీఎస్ తోపాటు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం నూతన జాతీయ విద్య విధాన చట్టాన్ని తెచ్చిందని ఇంతటిప్రమాదకరమైన విధానాలకు వ్యతిరేకంగా అంగన్వాడి ఉద్యోగస్తులు నిలబడి పోరాటాలు చేయాలని వారు అన్నారు. గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు అనేక హామీలు ఇచ్చారని కాంగ్రెస్ మేనిఫెస్టోలో కనీస వేతనం 18 వేల రూపాయలు చెల్లిస్తానని ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తానని చెప్పి నేటికీ హామీలు అమలు చేయలేదని చెప్పారు. ప్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్యను అంగన్వాడి కేంద్రాలలో నిర్వహించాలని విద్యాబోధనాల బాధ్యత అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కి ఇవ్వాలని ఒకే ఆన్లైన్ యాప్ ఉండే విధంగా వెంటనే నిర్ణయం చేసి ఫైజి నెట్వర్క్ తో కూడిన మొబైల్ ఫోన్లను టీచర్స్ అందజేయాలని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులనుభర్తీ చేసి సీనియారిటీకి ఇంక్రిమెంట్స్ నిర్ణయించాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్ప ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాడ్యుటి చెల్లించి రిటైర్డ్ అయిన అంగన్వాడీ ఉద్యోగులకు ఎలాంటి షరతులు లేకుండా ఆసరా పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు . అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని తక్షణం బిఎల్ఓ డ్యూటీనీ రద్దు చేసి అదనపు పనివారాన్ని తగ్గించాలనీ అంగన్వాడీ అండ్ హెల్పర్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం అనునిత్యం కార్మిక పోరాటాలు చేయాలని పోరాటాల ద్వారానే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని వారు కార్మికులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలకు పిలుపునిస్తామన్నారు. ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ధర్నా చేస్తున్న వారిని ఆపివేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీలం. శీను ఎస్.రాధాకృష్ణ జిల్లా కమిటీ సభ్యులు వట్టెపు సైదులు మిట్ట గనుపుల ముత్యాలు, షేక్ యాకూబ్ అంగన్వాడి నాయకురాలు భాస్కరమ్మ స్వరూప ధనలక్ష్మి నాగలక్ష్మి లింగమ్మ శారద విజయలక్ష్మి నాగేశ్వరమ్మ ప్రియాంక శ్రీలత తిరపయ్య తదితరులు పాల్గొన్నారు.






