- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాదగిరిగుట్టలోని బస్టాండ్‌లో దొరికిన చైన్‌ను భక్తులకు అప్పగించిన హోంగార్డు
భక్తులు పోగొట్టుకున్న బంగారు చైన్ ను గుర్తించి తిరిగి అప్పగించిన సంఘటన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్ర పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భక్తులు పోగొట్టుకున్న బంగారు చైన్ ను గుర్తించి తిరిగి అప్పగించిన సంఘటన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్ర పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. హైదరాబాద్ చెందిన భక్తులు స్వామి వారి దర్శనానికి యాదగిరిగుట్టకు వచ్చారు. ఈ క్రమంలో కొండపైన వారికి సంబంధించిన తులం బంగారం చైన్ బస్టాండ్ ఏరియాలో పోగొట్టుకున్నారు. అయితే ఆ చైన్ ను బస్టాండ్ లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు భాస్కర్ కు దొరికింది. ఆయన వెంటనే డ్యూటీ ఆఫీసర్ కు ఈ విషయాన్ని చెప్పాడు. కొండపైన మైకు ద్వారా దొరికిన చైన్ గురించి అనౌన్స్మెంట్ చేశారు. తమ చైన్ దొరికిందని గుర్తించిన భక్తులు అక్కడికి వెళ్లారు. ఎస్పీఎఫ్ ఎస్సై సీతారామయ్య, ఏఎస్ఐ రాజయ్య, నాగేశ్వరరావు, హోంగార్డు భాస్కర్ ఆధ్వర్యంలో చైన్ పోగొట్టుకున్న వారి వివరాలు తీసుకొని వారికి చైన్ ను అప్పగించారు. నిజాయితీగా విధులు నిర్వహించిన భాస్కర్ ను పలువురు అభినందించారు.






