- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా పదవి త్యాగం వల్లనే నియోజకవర్గంలో అభివృద్ధి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నియంత పాలనకు వ్యతిరేకంగా నా పదవీ త్యాగం వల్లనే నేడు నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

దిశ, చండూరు : నియంత పాలనకు వ్యతిరేకంగా నా పదవీ త్యాగం వల్లనే నేడు నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం చండూరు మున్సిపాలిటీలో నూతంగా ఏర్పాటు చేసిన వీధి లైట్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. చండూరు చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది అన్నారు. ఉప ఎన్నికల్లో ఓడించినప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్న నన్ను ప్రజలు తిరిగి గెలిపించారన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుతానన్నారు. ఇప్పటివరకు చేసింది తక్కువేనని ఇంకా చేయాల్సింది చాలా ఉంద న్నారు. గత ప్రభుత్వం పనులకు అనుమతులు ఇచ్చిన నిధులు మంజూరు చేయలేదన్నారు. నిధులు లేఖ పనులు ఆపితే పైసలు నాభద్యత ప్రభుత్వం ఇవ్వకపోతే నేనిస్తా అని హామీ ఇచ్చి పనులు చేపించా అన్నారు. స్థానిక నాయకులు పనులు పూర్తి చేయటానికి చాలా కష్ట పడ్డారన్నారు. రాబోయే రోజుల్లో చండూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వంద పడకల ఆసుపత్రి, సమీకృత మార్కెట్, కాలేజీలు కట్టాల్సి ఉందన్నారు. హైదరాబాద్ లి ఉన్న సౌకర్యాలు చండూరు లో ఉండేలా అభివృద్ధి జరగాలంటే మీ సహకారం ఉండాలని కోరారు. నియోజకవర్గం లో జరుగుతున్నా రోడ్డు పనులకు నిధులు విడుదల చేయాలనీ సీఎంని అడిగానని నియిజకవర్గంలో అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు తెలిపారు. అదిష్టానం పదవీ ఇస్తానని హామీ ఇచ్చిందని.. ఇవ్వాళా వద్దా అనేది వారి ఇష్టం అంటూనే, నన్ను ఎన్నుకున్న ప్రజలకు మాత్రం అన్యాయం చేయొద్దని సీఎంని కోరానన్నారు. మెదటి విడతలో ఇళ్లు రానివారికి రెండవ విడతలో వచ్చేవిదంగా కృషి చేస్తానని చేనేత కార్మికుల రుణాలు మంజూరు కు కృషి చేస్తాఅని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు అనంత చంద్రశేఖర్, కోరిమి ఓంకారం ,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్, నాయకులు కోడి గిరిబాబు, కలిమికొండ జనార్దన్, కోడి శ్రీనివాసులు, గంట సత్యం,మంచుకొండ సంజయ్, బూతరాజు దశరథ, నల్లగంటి మల్లేష్ పాల్గొన్నారు.






