ఉరేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

by Bhanu |

నల్లగొండ జిల్లా కేంద్రంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడెం మండలం కొత్తాల గ్రామానికి చెందిని బుర్ర శృతి (20) నాగార్జున డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది.

ఉరేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ, నల్లగొండ క్రైం: నల్లగొండ జిల్లా కేంద్రంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడెం మండలం కొత్తాల గ్రామానికి చెందిని బుర్ర శృతి (20) నాగార్జున డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు కుమార్తెకు పెళ్లి చేయాలనే ఉద్దేశ్యంతో సంబంధాలు చూస్తున్నారు. దీంతో పై చదువులు చదవాలని, తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, పలుమార్లు స్నేహితులతో చెప్పుకుని వాపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురై.. రవీంద్ర నగర్ లోని తాను ఉండే బీసీ హాస్టల్లోని బాత్‌రూంలో ఉరేసుకుంది. శృతి ఎంతకూ బయటకు రాకపోవడంతో స్నేహితులకు అనుమానం వచ్చి బాత్‌రూం డోర్ పగలగొట్టి చూడగా.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటినా టూ టౌన్ ఎస్ఐ సైదులు ఘటనా స్థలికి వెళ్లి వివరాలు సేకరించి, కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

Next Story