విద్యుత్ శాఖ లో కమీషన్ల దందా..!

by Ratna Kumari |

విద్యుత్ శాఖ అధికారులు క‌మీష‌న్ల‌కు క‌క్కుర్తి ప‌డుతున్నార‌ని ప‌లు సంద‌ర్భాల్లో నిరూపిత‌మైంది. కొంత మందికి శిక్ష‌లు ప‌డిన‌ప్ప‌టికీ వారు మాత్రం అవినీతికి పాల్ప‌డ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు.

విద్యుత్  శాఖ లో కమీషన్ల దందా..!
X

దిశ, ఆలేరు : విద్యుత్ శాఖ అధికారులు క‌మీష‌న్ల‌కు క‌క్కుర్తి ప‌డుతున్నార‌ని ప‌లు సంద‌ర్భాల్లో నిరూపిత‌మైంది. కొంత మందికి శిక్ష‌లు ప‌డిన‌ప్ప‌టికీ వారు మాత్రం అవినీతికి పాల్ప‌డ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. తాజాగా యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో విద్యుత్ అధికారులు ఇలాగే వ్య‌వ‌హ‌రించారు. ఆలేరు నియోజ‌క‌వ‌ర్గంలోని ఆలేరు మండ‌లానికి చెందిన ఓ కాంట్రాక్ట్ అధికారి సుమారు రూ.30ల‌క్ష‌ల వ‌ర‌కు ముట్ట‌జెప్పి భువ‌న‌గిరి డివిజ‌న్ లో పోస్టింగ్ ఇప్పించుకున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. అప్ప‌ట్లో ఈ విష‌యం పై దిశ ప‌త్రిక‌లో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. దీంతో అధికార వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ జ‌రిగింది. ఆ అధికారి బదిలీ పై భువనగిరి డివిజన్ కార్యాలయం లో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కార్యాలయంలో కమీషన్ల దందా బహిరంగగానే కొన‌సాగుతోందనే ఆరోపణలు విపిస్తున్నాయి.

కార్యాలయంలో కమీషన్ల దందా?

భువనగిరి డివిజన్ విద్యుత్ శాఖ పరిధిలోని 13 షేక్షన్ లలో విద్యుత్ పనులు చేసె కాంట్రాక్టర్లు నామినేట్, పద్దతి, టెండర్ల ద్వారా పనులను దక్కించుకొని భువనగిరి డివిజన్ కార్యాలయం పరిధిలో పనులు పూర్తి చేసిన ఆయా పనులకు సంబందించిన అగ్రిమెంట్లు, ఎస్టిమేషన్లు,పనుల ఎక్స్టెన్షన్ లెటర్ లు సమర్పించినప్పటికీ తాము కమిషన్లు ఇవ్వలేదనే నెపంతో కార్యాలయం లోని ఓ అధికారి కమీషన్ల దందాకు తెరలేపినట్లు సమాచారం. తన కింది స్థాయి సిబ్బంది ద్వారా తాము కార్యాలయం లో సమర్పించిన పేపర్లు దొరకడం లేదని కావాలనే ఉద్దేశపూర్వకంగా చేస్తూ తమకు సకాలంలో ఆయా పనుల బిల్లులు రాకుండా ఆలస్యం చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొంతమంది కాంట్రాక్టర్లు దిశ తో వాపోయారు. తాము వర్క్ ఆర్డర్ ప్రకారం పనులు పూర్తి చేసినప్పటికీ తమ బిల్లుల చెల్లింపుల లో ఆలస్యం చేస్తూన్నారని, మరి కొంతమంది కాంట్రాక్టర్లు వర్కర్ ఆర్డర్ ప్రకారం.. మొత్తం పనులు పూర్తి చేయనప్పటికీ వారు కమీషన్లు ఇవ్వగానే వారి బిల్లులు చెల్లిస్తున్నారని కొంతమంది కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు.

Next Story