- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దళిత సర్పంచ్, ఉప సర్పంచ్ లకు ఘన సన్మానం
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి చందంపేట, డిండి, దేవరకొండ, చింతపల్లి, గుడిపల్లి మండలాల పరిధిలో గెలిపొందిన నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు సన్మానం చేశారు.

దిశ, చందంపేట, నేరడుగొమ్ము : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి చందంపేట మండల పరిధిలో గెలుపొందిన దళిత సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్స్ ని దేవరకొండ నియోజకవర్గం MRPS ఆధ్వర్యంలో ఘన సన్మానించారు. రాష్ట్ర నాయకులు కంబాలపల్లి వెంకటయ్య, రాష్ట్ర కన్వీనర్ ఆరేకంటి యేసయ్య, నియోజకవర్గ ఇంచార్జ్ పొత్తెం సహదేవుడు పట్టణ అధ్యక్షులు పొట్ట ప్రభు.జిల్లా కార్యదర్శి ఎర్ర గిరి,ఆధ్వర్యంలో చిత్రీయాల సర్పంచ్ చాట్ల చిరంజీవి, గాగిళ్లాపురం సర్పంచ్ గుద్దేటి నాగార్జు, పెద్దమూల సర్పంచ్ చేపూరి సరస్వతి కొండల్, నేరేడుగొమ్ము సర్పంచ్ పులికంటి సుధాకర్, ముర్పునూతల సర్పంచ్ నాగిళ్ల శ్రైశైలంలను సత్కరించారు. ముఖ్య అతిథులుగా నల్లగొండ జిల్లా ఎమ్మార్పిఎస్ అధ్యక్షులు రామంజి సైదులు హాజరై మాట్లాడారు. దళితులు స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ లుగా ఎన్నిక కావడం గర్వ కారణం అన్నారు. రాబోయే రోజుల్లో అంబేద్కర్ ఆలోచనలతో రాజ్యాధికారం అనే నినాదంతో రాబోయే తరాలకు మీ సేవ ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ మండల అధ్యక్షులు మారేపల్లి యాదగిరి, చింతపల్లి మండల అధ్యక్షులు ఏసు, చందంపేట అధ్యక్షులు కొండ్రపల్లి నగేష్, గుడిపల్లి మండల అధ్యక్షులు ఎర్ర వంశీ, MSFజిల్లా అధ్యక్షులు హరికృష్ణ, ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి సీతయ్య, MSF డివిజన్ అధ్యక్షులు నాగేష్, దేవరకొండ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మారేపల్లి గిరి మండల అధ్యక్షులు పాల్గొన్నారు.






