మొలకెత్తని విత్తనాలు.. నష్టపరిహారానికి రైతుల డిమాండ్

by Naga Rani Yarlagadda |

ఎలిటో, కావేరి టిల్ విత్తనాల వలన తము వేసిన వరి పంట సక్రమంగా ఈనడం లేదని ఆందోళన చెందారు రైతులు.

మొలకెత్తని విత్తనాలు.. నష్టపరిహారానికి రైతుల డిమాండ్
X

దిశ నేరేడుచర్ల (పాలకవీడు): ఆదిత్య అగ్రిటెక్ సంస్థకు చెందిన ఎలిటో అలాగే కావేరి టిల్ విత్తనాల వలన తము వేసిన వరి పంట సక్రమంగా ఈనడం లేదని ఆందోళన చెందిన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల రైతులు వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. దీంతో సూర్యాపేట జిల్లా ఏడిఎస్ శ్రీధర్ రెడ్డి వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఈ విషయాన్ని తెలియపరిచారు. సోమవారం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి. శ్రీధర్ కంపసాగరం సేద్య విభాగం వ్యవసాయ అధికారికె.సంధ్యారాణి లు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి శూన్య పహాడ్ గుడుగుంట్ల పాలెం గ్రామాలకు వెళ్లి ‌రైతుల పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

రైతులు ఫిర్యాదుతో శాస్త్రవేత్తల పరిశీలన..

శూన్య పహాడ్ గ్రామానికి చెందిన రైతు రతన్ సింగ్ తన వ్యవసాయ పంట పొలంలో ఆదిత్య అగ్రిటెక్ సంస్థకు చెందిన ఎలిటో వరి విత్తనాలు తెచ్చి వరి పంటను సాగు చేశారు. అలాగే గుడుగుంట్ల పాలెం గ్రామానికి చెందిన రైతులు దొంగల వెంకటయ్య క్రిష్టిపాటి లింగారెడ్డి రామ్ రెడ్డి అనే రైతులు కావేరి టిల్ అనే వారి విత్తనాలను కొనుగోలు చేసికొని వచ్చి వరి పంట సాగు చేశామని దీంతో పంట నాసిరకంగా కనిపించడంతో దిగుబడి తగ్గుతుందని భావించిన రైతులు వ్యవసాయ అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు . వ్యవసాయ అధికారులు పంట పొలాలను పరిశీలించి విత్తనం లోపం వల్లనే జరిగి వచ్చునని భావించిన వ్యవసాయ అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తలకు విషయం తెలియపరిచారు. దీంతో సోమవారం పాలకవీడు మండలంలోని శూన్య పహాడ్ గుడుగుంట్ల పాలెం గ్రామాలకు వెళ్లి అక్కడ ఫిర్యాదు చేసిన రైతు పంట పొలాలను పరిశీలించారు.

ఈ విత్తనాలు వాడడం వల్ల నష్టపోయాం రైతులు..

ఆదిత్య అగ్రిటెక్ సంస్థకు చెందిన ఎలిటో అలాగే కావేరి టిల్ విత్తనాలు వేయడం వల్ల నష్టపోయామని రైతులు వాపోయారు. వేసిన వరి పంట పెరిగి సక్రమంగా ఈనడం లేదని మొదట కొంత ఈనితే తర్వాత కొంత ఈనుతుందని దీనివల్ల పంట కోత కోయడం కూడా ఇబ్బందిగా మారిందని అన్నారు. కోతకొచ్చిన పంట కూడా దిగుబడి 10బస్తాల వరకు తగ్గిందని తెలిపారు.ఒకేసారి ఈనక పోవడం వలన కోసిన ధాన్యంలో పచ్చ గింజ అధికంగా ఉండడం వలన ధర కూడా చాలా తక్కువ పడుతుందని వాపోయారు.గుడుగుంట్లపాలెం గ్రామంలోనే సుమారు 400 ఎకరాలు విత్తనాలు వేసువరి పంట సాగు చేశారని రైతులు చెప్పారు.

నివేదికలు రెండు మూడు రోజుల అందజేస్తాం. శాస్త్రవేత్తలు

రైతు పంట పొలాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ పంట పొలాల నుండి నమూనాలను సేకరించారు. రైతుల నుండి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు .వీటిని ల్యాబ్ లో పరీక్షించి రెండు మూడు రోజుల్లో ఈ విత్తనాలకు సంబంధించిన రిపోర్టును జిల్లా వ్యవసాయ అధికారికి అందజేస్తామన్నారు. ఈ పరిశీలనలో మండల వ్యవసాయ అధికారి. బి కళ్యాణ్ చక్రవర్తి ఏఈఓలు పి.గోపి వై .శ్రీకాంత్ రైతులు రతన్ సింగ్,దొంగల వెంకటయ్య, కృష్ణ, కిష్టపాటి లింగారెడ్డి, సారెడ్డి రామిరెడ్డి పాల్గొన్నారు.

Next Story