వీధి కుక్కల నియంత్రణపై అవగాహన కల్పించండి : కలెక్టర్

by velandi.Saikiran |   (  Updated:2025-09-01 15:36:57  IST  )

వీధి కుక్కల నియంత్రణపై అవగాహన కల్పించండి అని అదేహాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. అధికారులు, మండల

వీధి కుక్కల నియంత్రణపై అవగాహన కల్పించండి : కలెక్టర్
X

దిశ,నల్లగొండ: వీధి కుక్కల నియంత్రణపై అవగాహన కల్పించండి అని అదేహాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. అధికారులు, మండల ప్రత్యేకాధికారులు, ఆర్డీవోలతో సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఈ సందర్భంగా ఆమె వీధి కుక్కల నియంత్రణపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ద్వారా కరపత్రాలు పంపిణీ చేసి, ర్యాలీలు నిర్వహించి, వారి ద్వారా తల్లిదండ్రులకు కూడా అవగాహన చేరేలా చూడాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటు చేసి, వీధి కుక్కల వల్ల కలిగే సమస్యలు, స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్, దత్తత వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం పెంచాలని పేర్కొన్నారు.

గత వారం దేవరకొండ డివిజన్లో నిర్వహించిన వ్యాక్సినేషన్, దత్తత కార్యక్రమాలను ప్రశంసించిన కలెక్టర్, ఇదే విధంగా అన్ని మున్సిపాలిటీల్లో చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇటీవల జగిత్యాల జిల్లాలో జరిగిన కుక్కకాటు ఘటన మాదిరిగా నల్గొండ జిల్లాలో జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హెచ్చరించారు.అలాగే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తహసిల్దారులు వేగవంతంగా పరిశీలించి ఆర్డీవోలకు పంపాలని, ఆర్డీవోలు వాటిని ఆన్లైన్‌లో డిఆర్ఓకి చేరవేయాలని ఆమె ఆదేశించారు.ఈ టెలికాన్ఫరెన్స్‌లో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Next Story