ప్రజా ఉద్యమాలకు ఊపిరిలూదిన చరిత్ర సీపీఐది : పల్లా వెంకటరెడ్డి

by Ratna Kumari |

దిశ, కోదాడ : భారత రాజకీయ రంగంలో వందేళ్ళ సుదీర్ఘ ప్రయాణం కలిగి ప్రజా ఉద్యమానికి ఊపిరిలూదిన మహోన్నత చరిత్ర సీపీఐ పార్టీది అని

ప్రజా ఉద్యమాలకు ఊపిరిలూదిన చరిత్ర సీపీఐది : పల్లా వెంకటరెడ్డి
X

దిశ, కోదాడ : భారత రాజకీయ రంగంలో వందేళ్ళ సుదీర్ఘ ప్రయాణం కలిగి ప్రజా ఉద్యమానికి ఊపిరిలూదిన మహోన్నత చరిత్ర సీపీఐ పార్టీది అని ఆ పార్టీ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడలో సీపీఐ ప్రచార జాత విచ్చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్వతంత్ర భారతదేశంలో గత 78 సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు వస్తూపోతున్నాయి కానీ ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని మనకంటే ఎంతో వెనుక స్వాతంత్రం వచ్చిన దేశాలు అభివృద్ధిలోదూసుకుపోతున్నాయని కేవలం కరీబియన్ దేశ జనాభా లక్షలన్నర మాత్రమే అని ఆ దేశంలోని క్రీడాకారులు 150 కోట్లు ఉన్న భారత్ కంటే ఎంతో ముందు ఉన్నారని అందరూ గ్రహించాలని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈనాడు భారత పార్లమెంట్లో ఉన్న అనేకమంది పార్లమెంటు సభ్యులు నేర చరిత కలవారేనని భారత దేశంలో గత ఎనిమిది దశాబ్దాల కాలంలో ఒక్క నేర చరిత్ర ఉన్న వ్యక్తిని కూడా సిపిఐ పార్టీ ఎమ్మెల్యేగా గాని ఎంపిక గాని టికెట్ కేటాయించలేదు అది సిపిఐ పార్టీ కున్న చిత్తశుద్ధి అని ఆయన అన్నారు.ఆధికారం ఉన్న లేకపోయినా ప్రజా పోరాటాలె లక్ష్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ వాటి పరిష్కారం కోసం సిపిఐ కార్యకర్తలు... నాయకత్వం ముందు ఉంటారని అందువల్లనే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయ్యిందని ప్రత్యేక తెలంగాణ సాధనలో సిపిఐ పార్టీ క్రియాశీలక పాత్ర పోషించింది అని ఆయన సగర్వంగా ప్రకటించారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం రాష్ట్ర సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు కే శ్రీనివాస్ మహిళా సమాక్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన జిల్లా సిపిఐ కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాస్, ఎస్కే లతీఫ్, బత్తినేని హనుమంతరావు పాల్గొన్నారు.

Next Story