- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెప్మా లో అవినీతి జలగ.. ఫైల్ కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందే..
మహిళలు ఆర్థికంగా, స్వయం ఉపాధి ద్వారా రాణించాలన్న సంకల్పంతో ప్రభుత్వాలు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నాయి.

దిశ, సూర్యాపేట: మహిళలు ఆర్థికంగా, స్వయం ఉపాధి ద్వారా రాణించాలన్న సంకల్పంతో ప్రభుత్వాలు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నాయి. రుణాలు అందించి వారికి అండగా నిలవాల్సిన మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) లో నీ ఓ అవినీతి జలగ చేతివాటన్నీ ప్రదర్శిస్తూ అవకతవకలకు పాల్పడుతుoదని భారీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పొదుపు సంఘం మీటింగ్ లు పెట్టాలని హుకుం జారీ చేసి పొదుపు సంఘంలో ఉన్న మహిళలను ఒక దగ్గర కి చేర్చి మీటింగ్ పేరుతో రూ.5000 వసూలు చేస్తుందని బహిరంగ విమర్శలున్నాయి. మీటింగ్ పేరుతో పొదుపు సంఘాల మహిళలని తలుపులేసి మరి క్లాస్ తీసుకుంటుందని కొంతమంది మహిళలు ఆరోపిస్తున్నారు. మనం మాట్లాడుకునేది బయటికి ఎవరు చెప్పొద్దు, చెప్పిన వారి లోన్ కట్ చేస్తానని హుకుం జారీ చేసి డబ్బులు వసూలు చేస్తుందని బహిరంగానే మాట్లాడుకుంటున్నారు.
అంతా ఆమె ఇష్టమే
మహిళా పొదుపు సంఘాల సమాఖ్య లు సంబంధించి ఏడాదికి ఒకసారి ఆడిట్ నిర్వహించాల్సి ఉంటుంది ఈ ఆడిట్ లో ఎవరైతే తక్కువ కొటేషన్ ఇస్తారో ఆ పత్రాలను తమ పై అధికారులకు అందజేసి తక్కువ ఆడిట్ ఇచ్చిన ఆ సంస్థకి ఆడిట్ నిర్వహణ బాధ్యత లు అప్పగిస్తారు. వర్క్ ఆర్డర్ అందిన 15 రోజుల ల్లో ఆడిట్ నివేదిక ను ఆధారం చేసుకుని సమాఖ్య ల సర్వ సభ్య సమావేశం నిర్వహించి ఆమోదం పొందాలి. సర్వ సభ్య సమావేశం ఆ లో ఆర్ధిక లావాదేవీల వివరాలను తెలిజేయాలి. ఇలా కాకుండా ముడుపులు తీసుకుని తూ తూ మాత్రం గా నిర్వహించి అవినీతి జలగ జేబులు నింపుకుoటుదని బహిరంగ విమర్శలు ఉన్నాయి.
కొద్దిరోజుల క్రితం జిల్లాలోని ప్రధాన మున్సిపల్టి లో నకిలీ సంఘా లు ఏర్పాటు చేసి రుణాలు జారీ చేసిన అవినీతి ఆరోపణల తో సస్పెండ్ అయిన కమ్యూనిటీ ఆర్గనైజర్ (సిఓ) ను వేరే మున్సిపాలిటీ కి బదిలీ చేసి ఒక్క నెల రోజులోనే పై అధికారుల ఉత్తర్వులు లేకుండా నే ముడుపులు తీసుకుని తిరిగి పాత మున్సిపాలిటీ స్థానంలో కి తీసుకునేందుకు ఆమే ఉత్తర్వులు జారీ చేయడం తో జిల్లా అంతటా ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది.
నిబంధనలకు విరుద్ధంగా
మొత్తం నేనే చూసుకుంటాననీ భారీ ముడుపులు తీసుకొని ఆమె సంతకం పెట్టి ఉత్తర్వుల ను జారీ చేసిందన్న ఆరోపణలు లేకపోలేదు.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాం కొట్టే బాధ్యత సంఘం గ్రూపు సభ్యులకు ఉంటుంది. ఆమెకు ఎవరైతే ముడుపులు అప్ప చెబుతారో ఆ ఆర్పి ల కు ఇచ్చిందన్న బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో మీటింగ్ పెడితే
ముందే దారి ఖర్చులు ఇవ్వాలని అలాగే సమావేశానికి హాజరయ్యే మధ్యలో భోజన ఖర్చులు కూడా మీరే పెట్టుకోవాలని వారి నుండి మీటింగ్ పేరుతో రూ.5000, నుండి .7000 రూపాయల వరకూ వసూలు చేస్తుందని విమర్శలు గుప్పుమంటున్నాయి.
గతంలోనూ అవినీతి జలగ పై భారీ ఆరోపణలు
గతంలో చైన్ సిస్టం ద్వారా ఉన్న ఓ యాప్ లో జాయిన్ కావాలని కొంతమంది మహిళలను పక్కదారి పట్టించి డబ్బులు వసూలు చేసిందన్న విషయం జిల్లాలో చర్చ అయింది. ఆ యాప్ లో రూ.౫౦౦౦ కట్టి జాయిన్ అవ్వాలని జాయిన్ అయిన వెంటనే మీకు మొదట దఫాగా రూ.1600 వస్తాయని అలాగే రెండవ దఫాగా రూ.1300 వస్తాయని పొదుపు సంఘాలలో ఉండే అమాయక మహిళలను నమ్మబలికించి అందులో జాయిన్ అయ్యేల ప్రేరేపిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీ ల లో స్త్రీ నిధి, పొదుపు సంఘాల మీటింగ్ లు పెట్టాలనీ ఐకెపి ల ద్వారా జరిగిన ధాన్యం సేకరణ అక్రమలలో కూడా అవినీతి జలగా పాత్ర దండిగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మెప్మా కార్యక్రమాలు పొదుపు లు, స్త్రీ నిధి రుణాలు, మహిళా శక్తి రుణాలు పక్కదారి పట్టించడంలో ఈ అవినీతి జలగ దిట్ట అని ఆ శాఖలోని తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగికి అందలం ఇవ్వడం వల్లనే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ లో భారీ అవినీతి జరుగుతుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పై విచారణ జరిపి అవినీతి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు, పొదుపు సంఘాల మహిళలు కోరుకుంటున్నారు.
అవినీతి జరిగితే సహించం: పి.రాంబాబు సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా లో అవినీతి జరిగినట్టు మా దృష్టికి రాలేదు. ఎవరైనా మహిళలను తప్పుదోవ పట్టించి డబ్బులు దండుకుంటే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. అవుట్సోర్సింగ్ ఉద్యోగి మెప్మా సంస్థలో అవినీతి చేసినట్టు మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఎవరైనా మాకు ఫిర్యాదు చేస్తే వెంటనే పూర్తి విచారణ జరిపి అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటాం.






