శాలిగౌరారం ఎంపీడీవో పై అవినీతి ఆరోపణలు

by Nallavelli.Anjaneyulu |

మండ‌ల ఉన్న‌తాధికారి ప్ర‌భుత్వ ధ‌నాన్ని దుర్వినియోగం చేసింద‌నే ఆరోప‌ణ‌తో జిల్లా జ‌డ్పీ సీఈవో విచార‌ణ చేప‌ట్టిన ఘ‌ట‌న న‌ల్గొండ జిల్లా శాలిగౌరారం మండ‌లంలో చోటు చేసుకుంది.

శాలిగౌరారం ఎంపీడీవో పై అవినీతి ఆరోపణలు
X

దిశ, శాలిగౌరారం : ఓ ప్రభుత్వ మండల ఉన్నతాధికారి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపణలు ఓ వ్యక్తి ఆరోపణ చేయడంతో ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశంతో జిల్లా జడ్పీ సీఈవో విచారణ చేపట్టిన సంఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో చోటుచేసుకుంది.శాలిగౌరారం మండలం ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి తన సొంత ఖాతాలో జమ చేసుకుందని భైరవుని బండ గ్రామానికి చెందిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరిగె నర్సింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జడ్పీ సీఈవో శ్రీనివాసరావు శనివారం శాలిగౌరారం ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి ఎంపీడీవో జ్యోతిలక్ష్మిని దాదాపు గంట పాటు విచారణ చేశారు.

జడ్పీ సీఈఓ విచారణ సక్రమంగా చేయలేదు: ఫిర్యాదు దారులు నర్సింహా

తాను ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలపై జెడ్పి సీఈఓ నామమాత్రంగానే విచారణ చేశారని,ముఖ్యమైన విషయమైన బ్యాంకు లావాదేవీలపై టీజీబీవిబీ బ్యాంక్ మేనేజర్ సమక్షంలో విచారణ చేస్తే వాస్తవాలు బయటికి వచ్చేవని అన్నారు. ఎన్ ఆర్జిఎస్ నిధులలో, టీజీజీవీబీ బ్యాంకులో వేరే అకౌంట్ తీసి మండల పరిధిలోని ఆయా గ్రామాల నిధులను స్వాహా చేశారని అన్నారు. విచారణ లో తనకు అనుకూలంగా ఉన్న కొందరు కార్యదర్శులను పిలిపించారని,అన్ని గ్రామాల కార్యదర్శులను పిలిపించి ఒక్కొక్కరిగా విచారణ చేస్తే అసలు వాస్తవాలు బయటికి వచ్చాయ‌ని అన్నారు.

ఇంటి అనుమతికి రూ. 20,వేలు డిమాండ్

ఒక ప్రజాప్రతినిధిగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలనీ ఎంపిడిఓ ని కోరగా తాను మిర్యాలగూడ నుంచి శాలిగౌరారం వచ్చి పోతానని కార్ పెట్రోల్ ఖర్చు,తన ఖర్చుల కోసం ఒక ఇంటికి 20 వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసిందని తెలిపారు. ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తుందిగా అందులో రూ.20 వేలు ఇస్తే ఏమవుతుంది.పేదల ఇండ్ల కోసం డబ్బులు అడగడం కరెక్ట్ కాదని అడిగినందుకు అసభ్యంగా దూసించి తన వయస్సు కు కూడా గౌరవం ఇవ్వకుండా బయటకు పంపించిందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి లోతుగా విచారణ చేసి ఎంపీడీవో పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

వ్యక్తిగత కక్షతోనే నాపై ఆరోపణలు : ఎంపీడీవో జ్యోతి లక్ష్మీ

ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని అక్కసు, ఉపాధి హామీ పథకం లో సీసీ రోడ్ల కు సంబంధించిన తీర్మానం ఇవ్వలేదనే వ్యక్తిగత కక్షతోనే నరిగే నర్సింహ నాపై అవాస్తవాలను,అవినీతి ఆరోపణలను చేస్తున్నాడని ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె అన్నారు.మండల పరిధిలోని గ్రామాల కు సంబంధించిన ఏ అభివృద్ధి పనైనా,సంక్షేమ కార్యక్రమాలైన స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ల సూచన మేరకే నడుచుకుంటానని,వారిని కాదని నేను ఏమి చేయలేనని తనకు ప్రత్యేక అధికారాలు లేవని ఆమె అన్నారు.నర్సింహా అడిగిందల్లా చేయడానికి నేను ప్రభుత్వ అధికారినని,ఉన్నతాధికారుల సూచన మేరకే నా నిర్ణయాలు ఉంటాయని,నేనెవరికీ వ్యతిరేకం కానని ఆమె అన్నారు. నేను ఎవరి పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని, ఒక లేడీ ఆఫీసర్ నని చూడకుండా తన పట్ల నర్సింహ నే అనుచితంగా ప్రవర్తించాడని ఆమె అన్నారు.

Next Story