నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా : కుంభం

by Batti.Sumithra |

భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అనునిత్యం ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.

నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా : కుంభం
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అనునిత్యం ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం బీబీనగర్ మండలంలోని మాదారం, మదారం తండా, రాయపాడు, రాయపాడు తండాలలో ఈరోజు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి ఇంటింటికి కాంగ్రెస్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ తండాలలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చడానికి తనకు ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకే మధ్ధతు తెలపాలని కోరారు. కర్ణాటక ఎమ్మెల్సీ ప్రకాష్ బాబన్న హుక్కెరి భువనగిరి నియోజకవర్గానికి రాగా వారికి ఆయనకు స్వాగతం పలికి స్థానిక రాజకీయ స్థితి గతుల పై చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story