- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోరు నీళ్లకే బాదుడు.. మైనర్ బాలుడిపై కానిస్టేబుల్ కర్కశత్వం
తీర్చుకునేందుకు బోరు నీళ్లు తాగినందుకు మైనర్ బాలుడిని కానిస్టేబుల్ చితకబాదిన ఘటన, ఆత్మకూరు (ఎం)లో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, ఆత్మకూరు (ఎం) : దాహం తీర్చుకునేందుకు బోరు నీళ్లు తాగినందుకు మైనర్ బాలుడిని కానిస్టేబుల్ చితకబాదిన ఘటన, ఆత్మకూరు (ఎం)లో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన మజ్జిగ ప్రవీణ్ ఈ నెల 26 న తన వ్యవసాయ బావి (నారాయణ బావి) వద్దకు తన తల్లి విజయ గొర్రెలు మేపుతుండగా భోజనం తీసుకొని వెళ్ళాడు. వీరి వ్యవసాయ బావి పక్కనే ఉన్న 18 ఎకరాల వ్యవసాయ భూమిని ఆత్మకూరు(ఎం) పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న లింగం నాయక్ కౌలుకు చేస్తున్నాడు. దీనితో ప్రవీణ్ కు దాహం వేయడంతో కానిస్టేబుల్ కౌలు కు చేస్తున్న భూమికి సంబంధించిన బోరు మోటర్ ను ఆన్ చేసి దాహం తీర్చుకునేందుకు ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు పట్టుకున్నాడు.
అక్కడే మేత మేస్తున్న గొర్రెలు కూడా నీళ్లు తాగేందుకు బిడు పొలం లోకి వచ్చాయి. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్ లింగం నాయక్ బోర్ ఆన్ చేసి తాగేందుకు నీళ్లు పట్టుకుంటావా అంటూ మైనర్ బాలుడైన ప్రవీణ్ పై దాడి చేసి,కర్రతో చితక బాదినట్లు బాధితుడితో పాటు అతని తల్లి విజయ తెలిపారు. దాడి జరిగిన రోజే పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ లింగం నాయక్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. బుధవారం విలేకరుల సమావేశంలో కుర్మ సంఘం నాయకులు మాట్లాడుతూ మైనర్ బాలుడిపై అకారణంగా చితక బాదిన కానిస్టేబుల్ లింగం నాయక్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.






