భూ త‌గాదాల‌తో ఘ‌ర్ష‌ణ

by Ratna Kumari |

దిశ, సూర్యాపేట : భూ త‌గాదాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. క‌త్తుల‌తో ప‌ర‌స్ప‌ర దాడులు జ‌రిగాయి.

భూ త‌గాదాల‌తో ఘ‌ర్ష‌ణ
X

దిశ, సూర్యాపేట : భూ త‌గాదాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. క‌త్తుల‌తో ప‌ర‌స్ప‌ర దాడులు జ‌రిగాయి. దీంతో ఇరు కుటుంబాలకు తీవ్ర గాయాలైన సంఘ‌ట‌న మంగ‌ళ‌వారం ఆత్మ‌కూరు(ఎస్) మండ‌లం పాత‌ర్ల‌పాడు గ్రామంలో చోటు చేసుకుంది. దాడుల సమయంలో తీసిన వీడియో గ్రామంలో వైరల్ గా మారింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భూ వివాదంతో రెండు కుటుంబాల పరస్పరం దాడులు చేసుకున్నాయనీ ఒకరి పై ఒకరు కర్రలతో , రాళ్ళతో దాడులు చేసుకోవడంతో ఆరుగురికి గాయాలు కాగా వారిలో ఇద్దరికి తీవ్ర గాయాల‌య్యాయ‌ని తెలిపారు. గ్రామానికి చెందిన ఒకే కుటుంబనికి చెందిన కుంచెం మైసయ్య , రమేష్ నడుమ పొలం గట్టుకి సంబంధించి వివాదం నెలకొంది. దీంతో పరిష్కారం కోసం ఇరువురు పెద్ద మనుషులను ఆశ్రయించి పరిష్కారం చేసుకున్నారు. అయితే తీర్మానాన్ని వ్యతిరేకించి మైసయ్య తిరిగి వివాదానికి దిగడంతో రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెద్ద మనుషులు సైతం పోలీసులను త్వరగా సమస్య పరిష్కరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలు పరస్పరం దూషణలకు దిగారు. వివాదం ముదిరి కర్రలు , రాళ్ళతో దాడుల వరకు వెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివాదంలో వెంకటరమణ అనే మహిళ తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స నిమిత్తం ఖమ్మం కి తరలించారు. కుటుంబసభ్యులు, మిగతా వారిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Next Story