- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ క్రషర్‌పై ఫిర్యాదు
రాజపేట మండలం చల్లూరు గ్రామ వాతావరణాన్ని దెబ్బతీస్తున్న అక్రమ క్రషర్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని గ్రామ యువకులు పోరాటానికి సిద్ధమయ్యారు.

దిశ, రాజాపేట: రాజపేట మండలం చల్లూరు గ్రామ వాతావరణాన్ని దెబ్బతీస్తున్న అక్రమ క్రషర్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని గ్రామ యువకులు పోరాటానికి సిద్ధమయ్యారు. చల్లూరు గ్రామ యువకులు బుధవారం నిర్వహించిన గ్రామ సభలో అక్రమ క్రషర్ కంపెనీ వ్యవహారాలను కొత్త పాలకవర్గం దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలోని సర్వే నంబర్ 322/4లో శ్రీని డెవలపర్స్ అనే సంస్థ అక్రమంగా కంకర క్రషర్‌ను నడిపిస్తోందని, సరైన అనమతులు లేకుండానే నడుస్తున్న ఈ సంస్థపై చర్యలు తీసుకోవాలని గ్రామ యువకులు కొత్త పాలక వర్గాన్ని కోరారు.గ్రామ సర్పంచ్ బీమగాని రూప-బాలనర్సయ్యతో పాటు కార్యదర్శి, ఉప సర్పంచ్ బొంత సుధాకర్, వార్డ్ మెంబర్లకు ఆధారాలతో కూడిన ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. సదరు సంస్థ నుంచి నిబంధనల ప్రకారం రావాల్సిన పన్నులను వసూలు చేయాలని పేర్కొన్నారు. యువకుల ఫిర్యాదుకు సానుకూలంగా స్పందించిన కొత్త పాలక వర్గం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని, తమకు కాస్త సమయం ఇవ్వాలని కోరారు. గ్రామ పంచాయితీ నుంచి సదరు క్రషర్ కంపెనీకి ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ అక్రమ క్రషర్ వ్యవహారాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు గుంటి కృష్ణ, గంగు రాజిరెడ్డి, గణపురం శ్రీకాంత్, బడే రాజు, స్వామి, బైకని కనకయ్య, మహేశ్వరం సుధాకర్, మీరాతో పాటు సీనియర్ నాయకులు మాటూరి శ్రీనివాస్, సామల రమేశ్, బింగి శ్రీనివాస్, ముగిగడప కనకయ్య, శాగ నవీన్, ఉప్పల శివ, సామల వినోద్, సట్ట విజయ్, మునిగడప శ్రీకాంత్, బొడ్డు సురేశ్, ఆముదాల అజయ్ పాల్గొన్నారు.






