- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
102 సంవత్సరాల వృద్ధురాలికి స్వాగతం : కలెక్టర్ హనుమంతరావు
దిశ, యాదాద్రి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పచ్చని

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పచ్చని మొక్కలు, పూల తోరణాలు, రంగుల ముగ్గులు, కొబ్బరి మట్టలతో, స్వాగత తోరణాల మధ్య ఓటర్లకు పూల మొక్కలతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్వాగతం పలికారు. భువనగిరి మండలం అనంతారం గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న 102 సంవత్సరాల మణెమ్మ అనే వృద్ధురాలికి పూల మొక్కతో కలెక్టర్ హనుమంతరావు స్వాగతం పలికారు. రెండవ విడత జరుగుతున్న పోలింగ్ సరళని పోచంపల్లి మండలం లోని జలాల్పూర్ గ్రామంలో ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని, బీబీనగర్ మండల కేంద్రంలోని ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని, భువనగిరి మండలం అనంతారం ఆదర్శన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఓటర్లు ఓటు వేసేందుకు చేసిన ఏర్పాట్లను, పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఓటర్లు ప్రశాంతంగా ఆహ్లాదకరమైన, పర్యావరణ హితమైన పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మాట్ లో నమోదు చేయాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశించారు.






