- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం: సీఐ నరసింహారావు
ఈనెల 11న జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తుంగతుర్తి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు తెలిపారు. మంగళవారం ఆయన దిశతో మాట్లాడారు. సర్కిల్ పరిధిలో ఉన్న నూతనకల్, తుంగతుర్తి, మద్దిరాల మండలాల్లో 57 గ్రామ పంచాయతీలు ఉన్నాయని తెలిపారు.

దిశ, తుంగతుర్తి: ఈనెల 11న జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తుంగతుర్తి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు తెలిపారు. మంగళవారం ఆయన దిశతో మాట్లాడారు. సర్కిల్ పరిధిలో ఉన్న నూతనకల్, తుంగతుర్తి, మద్దిరాల మండలాల్లో 57 గ్రామ పంచాయతీలు ఉన్నాయని తెలిపారు. ఇందులో 18 ప్రాంతాలను సమస్యత్మకమైనదిగా గుర్తించి అక్కడి ప్రజలకు శాంతి భద్రతలపై ప్లాగ్ మార్చ్, సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. అలానే జీవనోపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారితో పాటు ఆయా గ్రామాల్లో ఉన్న 113 మంది రౌడీ షీటర్లను గుర్తించి, ఆయా మండలాల తహశీల్దార్ల ముందు బైండోవర్ చేసినట్లు తెలిపారు.
వీరంతా రూ.2 నుండి 5 లక్షల వరకు హామీగా పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి జిల్లాలోని కోదాడ, హుజూర్ నగర్, తదితర ప్రాంతాల నుంచి పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది వస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఒక్కో మండలానికి ముగ్గురు చొప్పున మొత్తంగా మూడు మండలాల్లో ఎస్సై, సీఐ, డీఎస్పీలు (మొత్తంగా తొమ్మిది మంది) శాంతి భద్రతలను పర్యవేక్షిస్తారని తెలిపారు. అంతేకాకుండా మొత్తంగా ఏర్పాటైన 18 రూట్లలో పోలీస్ అధికారులు, సిబ్బంది పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటారని వివరించారు. గ్రామాల్లో అల్లర్లు సృష్టించే వారిపై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. సమస్యలు ఉన్నప్పుడు వాటిని తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు.






