రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి

by velandi.Saikiran |

రోడ్డు ప్రమాదాలు, అత్యవసర సమయాల్లో బాధితులకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని మన్మధ కుమార్ అన్నారు

రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి
X

దిశ, చౌటుప్పల్ టౌన్: రోడ్డు ప్రమాదాలు, అత్యవసర సమయాల్లో బాధితులకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ అన్నారు. ప్రతిభ ఒకేషనల్ కళాశాలలో బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం పూర్వపు చీప్ ప్రకాష్ మణి దాదీ 18వ పుణ్య తిథి సందర్భంగా శనివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న ఎంతోమందికి ప్రాణదాతలు అవుతారని అన్నారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేసి వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ భార్గవ్, బ్రహ్మ కుమారిస్ సెంటర్ ఇన్చార్జ్ స్వర్ణలత, కళాశాల కరస్పాండెంట్ సిలివేరు ధనలక్ష్మి, ప్రిన్సిపాల్ సిలివేరు శ్రీనివాస్, అధ్యాపక బృందం, వాలంటరీస్ ముత్యాలు, లక్ష్మి, మురళి, సుధాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story