మ‌ద్యం మ‌త్తులో ఏఎన్ఎం పై చేయి చేసుకున్న సీహెచ్ఓ..?

by Ratna Kumari |

దిశ, చివ్వెంల : సూర్యాపేట జిల్లా, చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ( సబ్ సెంటర్లో) ఘోరం

మ‌ద్యం మ‌త్తులో ఏఎన్ఎం పై చేయి చేసుకున్న సీహెచ్ఓ..?
X

దిశ, చివ్వెంల : సూర్యాపేట జిల్లా, చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ( సబ్ సెంటర్లో) ఘోరం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం మత్తులో వచ్చిన సీహెచ్ఓ అక్కడే ఉన్న ఏఎన్ఎం పై విచక్షణారహితంగా దాడి చేసి హల్చల్ చేశారని సోషల్ మీడియాలో పోస్ట్ లు చక్కర్లు కొడుతున్నాయి. బాధితురాలు ఏఎన్ఎం కేకలు వేయడంతో స్థానికులు చేరుకుని అతడిని బయటకు పంపించార‌ని.. ఈ దృశ్యాలను డాక్టర్ చిత్రీకరించి ఉన్నతాధికారులకు పంపించారని విశ్వసనీయ సమాచారం. ప్రజలకు వైద్యం అందించాల్సిన వ్యక్తులే ఇలా ప్రవర్తించడం పట్ల ప్రజలు ఆశ్చర్యమే వ్యక్తం చేస్తున్నారు.

ఉన్న‌తాధికారుల‌కు తెలియ‌జేశాం : వైద్యాధికారిని భ‌వాని

ఈ విష‌యాన్ని ఉన్న‌తాధికారుల‌కు తెలియ‌జేశాం. ఉన్న‌తాధికారుల ఆదేశాల మేర‌కు చ‌ర్య‌లు తీసుకుంటాం అని మండ‌ల వైద్యాధికారిని భ‌వాని దిశ‌కి తెలిపింది.

Next Story