చిట్యాల ఎంపీడీఓ జ‌య‌ల‌క్ష్మీ స‌స్పెండ్

by Ratna Kumari |

దిశ, చిట్యాల : చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఈనెల 11న పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే

చిట్యాల ఎంపీడీఓ జ‌య‌ల‌క్ష్మీ స‌స్పెండ్
X

దిశ, చిట్యాల : చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఈనెల 11న పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఓట‌ర్లు వేసిన పోలింగ్ స్లిప్ లు బ‌య‌టికి వ‌చ్చాయ‌ని క‌లెక్ట‌ర్ ఇలా త్రిపాఠి చిట్యాల ఎంపీడీవో ఎస్పీ జ‌య‌ల‌క్ష్మీని స‌స్పెండ్ చేశారు. పోలింగ్ అనంతరం మరుసటి రోజు ఓటర్లు వేసిన పోలింగ్ చిట్టీలు పోలింగ్ స్టేషన్ కి పరిసర ప్రాంతమైన డ్రైనేజీలో లభించడంతో దీనిపై ఓడిపోయిన అభ్యర్థి రుద్రారం బిక్షపతి పోలీస్ స్టేషన్ లో ఎన్నికల అధికారులకు, క‌లెక్ట‌ర్ కి ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఈ సంఘటన పై నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తి విచారణ చేయించింది. ఈ విచారణలో మండల ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఎంపీడీవో జయలక్ష్మి బాధ్యత రాహిత్యం నిర్లక్ష్య వైఖరి కార‌ణంగానే ఈ సంఘటన జ‌రిగింద‌ని భావించి ఆమెను, ఆమెతో పాటు ఆ పోలింగ్ స్టేషన్ లో పనిచేసిన 11 మంది ఎన్నికల సిబ్బందిని సస్పెండ్ చేశారు.

Next Story