- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హృదయవిదారక ఘటన.. కండ్ల ముందే కన్న కొడుకు కానరాని లోకాలకు
సూర్యాపేట జిల్లాలోని నెమ్మికల్ దండు మైసమ్మ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మోక్షిత్ ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన గురువారం చోటుచేసుకుంది.

దిశ, నల్లగొండ బ్యూరో : సూర్యాపేట జిల్లాలోని నెమ్మికల్ దండు మైసమ్మ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మోక్షిత్ ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటన అక్కడి వారిని కలచివేసింది. కండ్లముందు కన్న బిడ్డ మృతిని చూసిన తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి.
కట్టంగూరు మండలం తేలు వారిగూడెం గ్రామానికి చెందిన గట్టి గొర్ల మహేష్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. గురువారం రోజు నెమ్మికల్ వద్ద ఉన్న మైసమ్మ గుడికి మొక్కులు తీర్చుకునేందుకు కుటుంబ సమేతంగా బయల్దేరారు. అక్కడే ఉన్న బంధువుల ఆహ్వానంతో మొత్తం కుటుంబం వెళ్లింది.
ఘటన జరిగిన సమయంలో మోక్షిత్ తండ్రి మహేష్ వద్ద నుండి విడిపడి రోడ్డుపై ఉన్న తన తాత వద్దకు వెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో మోక్షిత్ రోడ్డు దాటుతుండగా TS29T 2334 నెంబర్ గల ట్రాక్టర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని వెంటనే సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై ఆత్మకూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చిన్నారి మృతి కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.






