ఫ్లాష్: MP కోమటిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన చెరుకు సుహాస్

by Disha Web Desk 19 |
ఫ్లాష్: MP కోమటిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన చెరుకు సుహాస్
X

దిశ, నల్లగొండ: కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనకు కాల్ చేసి చంపేస్తామని బెదిరించారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ కొడుకు డాక్టర్ చెరుకు సుహాస్‌ ‘‘దిశ’’కు తెలిపారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు కోమటిరెడ్డి కాల్ చేసి బెదిరించారని.. దీంతో ఆయనపై నల్లగొండ వన్ టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సుహాస్ వెల్లడించారు. వెంటనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అరెస్ట్ చేసి తనకు రక్షణ కల్పించాలని కోరారు.

ఆడియోలో ఉన్న బెదిరింపులు:

‘‘మీ తండ్రి చెరుకు సుధాకర్‌ని చంపాడానికి నా అభిమానులు, అనుచరులు 100 కార్లలో తిరుగుతున్నారు. నిన్ను కూడా సంపుతారు.. నీ హాస్పిటల్ కూడా కూలగొడుతరు. వందల సార్లు నన్ను తిట్టిండు. లక్షల మందిని నేను బ్రతికించిన లం.. ఎంత ధైర్యం నన్ను అనడానికి.. వాడిని వదిలి పెట్టరు. నా మనుషులు మాత్రం ఊరుకోరు. నీకు నేను వార్నింగ్ ఇస్తున్న. వాడు క్షమించండి అని చెప్పాలి. లేదు అంటే నిన్ను కూడా సంపేస్తారు’’ అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేసి ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ.. బెదిరించారని సుహాస్ ఆ ఆడియోను బయటపెట్టారు.



Next Story

Most Viewed