విద్యుత్ షాక్ తో పశువులు మృతి

by Bhanu |

విద్యుత్ షాక్ తో పశువులు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని యడవెల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

విద్యుత్ షాక్ తో పశువులు మృతి
X

దిశ, నూతనకల్ : విద్యుత్ షాక్ తో పశువులు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని యడవెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మున్న గంగమల్లు, బయ్య గంగయ్యకు చెందిన రెండు ఎద్దులు పొలాల్లో పొట్లాడుకుంటూ దగ్గర్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కు తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి. పశువులు చనిపోవడంతో యజమానులు పశువులపై పడి రోధించిన ఘటన గ్రామస్తుల హృదయాలను కలిసి వేసింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.


Next Story