మేం చెప్పినట్టు చేయకపోతే ఆ ఫోటోలు బయట పెడతాం.. యువతికి బెదిరింపులు..

by Batti.Sumithra |   (  Updated:2025-03-20 06:52:40  IST  )

మద్యం తాగించి యువతిని లోబర్చుకొని, కోరిక తీర్చకపోతే ఆమె రహస్య ఫోటోలు బయట పెడతానని బెదిరించిన వ్యక్తుల పై కేసు నమోదు చేసినట్లు హుజూర్ నగర్ ఎస్ఐ ముత్తయ్య బుధవారం రాత్రి విలేకరులకు తెలిపారు.

మేం చెప్పినట్టు చేయకపోతే ఆ ఫోటోలు బయట పెడతాం.. యువతికి బెదిరింపులు..
X

దిశ, హుజూర్‌నగర్: యువతికి మద్యం తాగించి లోబరుచుకుని, ఆపై ఫోటోలు తీసి బెదిరిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై ముత్తయ్య గురువారం వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. బాధిత యువతికి పట్టణంలో నివాసం ఉంటున్న స్వామితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే స్వామి మిత్రుడు నూకతోటి ప్రమోద్ కుమార్ బాధిత యువతిని పరిచయం చేసుకున్నాడు. ఈ నెల 7న మధ్యాహ్నం ప్రమోద్ కుమార్ యువతితో మాట్లాడాలంటూ పట్టణంలోని ఎస్వీ లాడ్జికి తీసుకెళ్లాడు.

అక్కడ యువతికి మద్యం తాగించి.. మత్తులోకి జారుకోగానే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి రహస్యంగా సెల్‌ఫోన్‌లో ఆమె ఫోటోలు తీశాడు. ఇక అప్పటి నుంచి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలంటూ.. లేకపోతే తన వద్ద ఉన్న ఫొటోలను బయటపెడతానంటూ బెదిరిస్తున్నాడు. కాగా, ఈనెల 18న మధ్యాహ్నం ప్రమోద్ కుమార్, హరీష్ బాధిత యువతి బలవతంగా కారులో ఎక్కించుకుని హుజూర్‌నగర్ పట్టణంలోని రిజిస్ట్రేషన్ ఆఫీస్ వైపునకు తీసుకువెళ్లారు. అనంతరం ఆమెను శారీరకంగా కలవాలని లేకపోతే ఫొటోలు బయట పెడతామంటూ బెదిరించారు. అందుకు యువతి ఎంతకీ ఒప్పుకోకపోడంతో విచక్షణారహితంగా ఆమెను కొట్టి గాయపరిచారు. ఇదే విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముత్తయ్య తెలిపారు.

Next Story