స్తంభాన్ని ఢీకొని పల్టీ కొట్టిన కారు.. మేకల కొనేందుకు వెళ్లి మృత్యు ఒడిలోకి

by Bhanu |

అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టడంతో కారు పల్టీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలైన సంఘటన మునగాల మండలం బరకత్ గూడెం ఫ్లైఓవర్ వద్ద చోటుచేసుకుంది.

స్తంభాన్ని ఢీకొని పల్టీ కొట్టిన కారు.. మేకల కొనేందుకు వెళ్లి మృత్యు ఒడిలోకి
X

దిశ, కోదాడ: అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టడంతో కారు పల్టీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలైన సంఘటన మునగాల మండలం బరకత్ గూడెం ఫ్లైఓవర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సనత్ నగర్ కు చెందిన అబ్దుల్ ఖలీక్ అతని స్నేహితులు హైదరాబాదు నుండి విజయవాడకు మేకలు కొనేందుకు వెళుతున్న క్రమంలో బరాకత గూడెం ఫ్లైఓవర్ వద్దకు రాగానే కారు డివైడర్ మధ్యలో ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహమ్మద్ అబ్దుల్ ఖలీక్ (25) కారులో ఉన్న మరో ముగ్గురు తీవ్ర గాయాలు కావడంతో 108 సహాయంతో కోదాడ ప్రభుత్వాసుపత్రి తరలిస్తున్నంగా అబ్దుల్ ఖలీక్ మృతి చెందగా మరో ముగ్గురైన అబ్దుల్లా, కైసర్ యాసిన్ లకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి బాబాయ్ మహమ్మద్ అబ్దుల్ హబీబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ డి వెంకటరత్నం తెలిపారు.




Next Story