కన్న పేగును వదిలించుకున్న కసాయి తల్లి

by Ratna Kumari |

ఆడపిల్ల పుడితే అదృష్టవంతులని భావించే ఈ రోజుల్లో కూడా ఓ కసాయి తల్లి కన్న పేగును వదిలించుకుంది. ఈ అమానవీయ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని పడమటి సోమారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.

కన్న పేగును వదిలించుకున్న కసాయి తల్లి
X

దిశ, భూదాన్ పోచంపల్లి (బీబీనగర్): ఆడపిల్ల పుడితే అదృష్టవంతులని భావించే ఈ రోజుల్లో కూడా ఓ కసాయి తల్లి కన్న పేగును వదిలించుకుంది. ఈ అమానవీయ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని పడమటి సోమారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని శ్రీ బసవ లింగేశ్వర స్వామి దేవాలయ పరిసరాలలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును వదిలేసి వెళ్లారు. వదిలేసి వెళ్లిన కాసేపటికే ఆ పాప ఏడుపు కేకలు వినిపించడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వెళ్లి చూడగా చిన్నారి ఉండడాన్ని గమనించారు. పాప వద్ద ఎవరు లేకపోవడంతో స్థానికులు కొద్దిసేపు ఆశ్చర్యానికి గురయ్యారు. పసికందును వదిలి వెళ్ల‌డానికి ఆ కసాయి తల్లికి చేతులు ఎలా వచ్చాయి అంటూ స్థానికులు మండిపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని ఆ చిన్నారిని బీబీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

Next Story