ప్రియుడి కోసం రెండేళ్ల చిన్నారిని బస్టాండ్‌లో వదిలి వెళ్లిన కసాయి తల్లి

by Muthe.Rajitha |

నల్గొండలో ఓ హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది.

ప్రియుడి కోసం రెండేళ్ల చిన్నారిని బస్టాండ్‌లో వదిలి వెళ్లిన కసాయి తల్లి
X

దిశ, నల్లగొండ క్రైం: నల్గొండలో ఓ హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. లవర్ మోజులో పడిన ఓ మహిళ తన కొడుకును బస్టాండ్ లో వదిలేసి ప్రియుడితో జంప్ అయ్యింది. ప్రయాణికులు బాబును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఓ మహిళ 15 నెలల బాబును వదిలేసి.. వేరే యువకుడితో బైక్ మీద వెళ్లింది. పట్టణంలోని పాత బస్తీకి చెందిన ఒక యువకుడితో.. హైద్రాబాద్ కు చెందిన నవీన అనే మహిళ ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయ్యింది.

మహిళకు పెళ్లి అయ్యి.. 15 నెలల బాబు ధనుష్ ఉన్నాడు. ఈ క్రమంలోనే.. భర్తను, 15 నెలల పిల్లాడిని వదిలేసి మహిళ వెళ్లేందుకు ప్లాన్ వేసింది. డైరెక్ట్ గా నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్ కు బాబుతో పాటు వచ్చి.. ఆ బాబును బస్టాండ్ లోనే వదిలేసి వెళ్ళింది. ఆ తర్వాత.. బాలుడు తల్లి కోసం వెతుకుతూ ఏడవడం చూసిన ప్రయాణికులు, డిపో సిబ్బంది.. నల్లగొండ టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. టూటౌన్ ఎస్సై సైదులు వెంటనే స్పందించి.. స్టేషన్ లోని సిబ్బందిని ఆర్టీసీ బస్టాండ్ కు పంపారు. పోలీసులు.. బస్టాండ్ లోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. బైక్ మీద వెళుతున్న ఓ మహిళ వీడియోను చూసి.. ఆ బాలుడు "మమ్మీ" అంటూ గుర్తించాడు.

ఆ బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా.. విచారణ చేపట్టిన పోలీసులకు.. బైకు యజమాని నుంచి అతని స్నేహితుడు బైక్ తీసుకెళ్లినట్లు తేలింది.. అటువైపుగా విచారణ చేపట్టగా.. ఇంస్టాగ్రామ్ లో ఒక యువకుడు పరిచయమై.. భర్తను పిల్లాడిని వదిలేసి మహిళ వెళ్లేందుకు చేసిన ప్రయత్నమేనని పోలీసుల విచారణలో బయటపడింది. అనంతరం.. మహిళను, ఆమె ఇన్ స్టాగ్రామ్ ప్రేమికుడిని.. ఆమె భర్తను పోలీస్ స్టేషన్ కి పిలిపించి.. కౌన్సెలింగ్ ఇచ్చి.. బాలుడు తండ్రికి పిల్లాడిని అప్పగించారు.

నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు గౌడ్, పోలీసు సిబ్బంది పనితీరుపై నల్గొండ ప్రజానీకం హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రియుని కోసం ముక్కు పచ్చలారని చిన్నారిని నిర్ధాక్షిణ్యంగా బస్టాండ్‌లో వదిలి వెళ్లడం ఏమిటని సదరు మహిళపై నెటిజన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు.

Next Story