సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం

by Nallavelli.Anjaneyulu |

దిశ, నల్లగొండ, కలెక్టరేట్: సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ

సీఎం రేవంత్ రెడ్డి  దిష్టిబొమ్మను దగ్ధం
X

దిశ, నల్లగొండ, కలెక్టరేట్: సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రం లో గురువారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో హిందువులను, హిందూ దేవుళ్ళను అడుగడుగున అవమానిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకులకి తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ఒక వర్గం మెప్పు కోసం మైనారిటీల ఓట్ల కోసం ముఖ్యమంత్రి హోదాలో ఉండి సీఎం రేవంత్ రెడ్డి హిందూ మనోభావాల దెబ్బతీసే విధంగా మాట్లాడడం చాలా బాధాకరమన్నారు. నల్లగొండ జిల్లా కు చెందిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక వర్గానికి మేలు చేయడం కోసం హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని హిందూ దేవాలయాల దగ్గరికి వచ్చి ముస్లింల కు అనుకూలంగా మాట్లాడతారని ఎంఐఎం పార్టీకు తొత్తులుగా ఓవైసీ బ్రదర్స్ వత్తాసుగా రాష్ట్ర ప్రభుత్వం వారి మెప్పుకోసం పనిచేస్తుందనీ ఆరోపించారు. హిందూ దేవుళ్లను కించ పరిస్తే ఊరుకునేది లేదన్నారు. ఎక్కడికక్కడ అడ్డుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వాక్యాలకు బేషరతుగా ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్, పట్టణ అధ్యక్షులు గడ్డం మహేష్, కంకణాల నాగిరెడ్డి, బిపంగి జగ్జీవన్, కటకం శ్రీధర్, మంగినపల్లి కిషన్, దాసరి కృష్ణ, బిపంగి వినోద్, ఏరుకొండ హరి, చింత శివరామకృష్ణ, నరసింహ పుల్లెంల శ్యామ్, యానాల శ్రీనివాస్ రెడ్డి, డా. అరవింద్ రెడ్డి, దుబ్బాక సాయి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story