బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

by Nallavelli.Anjaneyulu |

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : బీజేపీ నల్గొండ పార్లమెంట్ కో కన్వినర్ పిల్లి రామ రాజు యాదవ్ పై గురువారం బీజేపీ

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
X

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : బీజేపీ నల్గొండ పార్లమెంట్ కో కన్వినర్ పిల్లి రామ రాజు యాదవ్ పై గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో నాగం వర్షిత్ రెడ్డి, అతని అనుచరులు దాడి చేయడం సరైనది కాదని, బీసీ నేతలపై దాడి చేస్తే సహించేది లేదని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ అన్నారు. రామరాజు యాదవ్ పై దాడిని నిరసిస్తూ శుక్రవారం ఉదయం నల్లగొండ పట్టణ కేంద్రంలోని క్లాక్ ట‌వ‌ర్ సెంట‌ర్ లో యాదవ సంఘం, బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిరసన తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగభూషత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్య అతిథిగా యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ పాల్గొని మాట్లాడారు. యాదవులపై దాడి చేస్తే సహించేది లేదని వెంటనే బీజేపీ అధిష్టానం జిల్లా అధ్యక్ష, పదవీ నుంచి నాగం వర్షిత్ రెడ్డిని తొలగించాలని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు, దుడుకు లక్ష్మీనారాయణ, యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు బెల్లి నాగరాజు యాదవ్, మాట్లాడుతూ నాగం వర్షిత్ రెడ్డి పిల్లి రామరాజు యాదవ్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మిర్యాల యాదగిరి, బీసీ జేఏసీ నాయకులు గజ్జి అజయ్ యాదవ్, అల్లి వేణు యాదవ్, నరేష్ గౌడ్, రేణుక, లక్ష్మి, గట్టిగొర్ల సత్యనారాయణ యాదవ్.యాదవ రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చల్లా కోటేష్ యాదవ్, గుండబోయిన సురేష్ యాదవ్, కుంటి గొర్ల లింగయ్య యాదవ్, బత్తుల నరేష్ యాదవ్, దొండ మల్లేష్ యాదవ్ పేరం మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు.

Next Story