నష్టాల ఒడిదుడుకుల్లో బిల్డర్ ఆత్మహత్య...!

by Kavya |
నష్టాల ఒడిదుడుకుల్లో బిల్డర్ ఆత్మహత్య...!
X

దిశ, నల్లగొండ క్రైం: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓ బిల్డర్ మద్యం వ్యసనంతో మనోవేదనకు గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. 2 టౌన్ ఎస్‌ఐ వై. సైదులు తెలిపిన వివరాల ప్రకారం... జిల్లా యాదగిరి (45) అమ్మనబోలు మండలం బెండలపహాడ్ గ్రామానికి చెందినవాడు. ప్రస్తుతం నల్లగొండ పట్టణంలోని వీటికాలనీలో నివాసముండే అతడు, బిల్డర్‌గా వ్యాపారం చేసేవాడు.

2020లో తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొన్న అతడు అప్పటి నుంచి మద్యం బానిసగా మారాడని కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం ఉదయం "వాకింగ్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన యాదగిరి, రాఖ్ హిల్స్ కాలనీ సమీపంలోని గ్రీన్ హిల్స్ కాలనీలో ఖాళీ ప్రదేశంలో ఉన్న చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







Next Story

Most Viewed