బీఆర్‌ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్

by Bhanu |

రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు శనివారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బీఆర్‌ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్
X

దిశ, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు శనివారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి మల్లారెడ్డి, సీనియర్ నాయకులు ప్రభాకర్, జెల్లా వెంకటేశం, గుత్త నర్సిరెడ్డి, వనం చంద్రశేఖర్, బట్టే సంతోష్ కుమార్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story