బీపీఎం ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. కాపాడిన పోలీసులు

by Nallavelli.Anjaneyulu |

దిశ, రాజాపేట: మండలం లోని సింగారం గ్రామంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా పనిచేసే ధనలక్ష్మి రాజాపేట లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.

బీపీఎం ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. కాపాడిన పోలీసులు
X

దిశ, రాజాపేట: మండలం లోని సింగారం గ్రామంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా పనిచేసే ధనలక్ష్మి రాజాపేట లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అద్దె ఇంట్లో బెడ్ రూమ్ కు గడియ పెట్టి ఫ్యాన్ కు చీరతో ఊరేసుకునే యత్నం చేస్తుండగా.. స్థానికులు పోలీసుల‌కు సమాచారం అందించారు. ఎస్సై అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఎఎస్ఐ ప్రకాష్ బృందం, అక్కడున్న వారి సహకారం తో తలుపును తెరిచి మెడకు ఉన్న‌ చీరను తొలగించారు. వెంటనే రాజాపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించగా మెరుగైన వైద్య సేవల కోసం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సమస్యల కారణమ‌ని సమాచారం.

Next Story