- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఆర్పీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా బొడ్డుపల్లి చంద్రశేఖర్ నియామకం
దిశ, పెద్దవూర : తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పెద్దవూర మండలం, పులిచర్ల గ్రామానికి

దిశ, పెద్దవూర : తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పెద్దవూర మండలం, పులిచర్ల గ్రామానికి చెందిన బొడ్డుపల్లి చంద్రశేఖర్ ని అధికారికంగా నియమిస్తూ టీఆర్పీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ పార్టీ బలోపేతం, యువత చైతన్యం, బీసీ – బహుజన హక్కుల రక్షణలో యువజన విభాగం కీలక పాత్ర పోషించాల్సిన అవసరాన్ని సూచించారు. యువతకు ఆత్మవిశ్వాసం నింపే నాయకుడిగా చంద్రశేఖర్ నియామకం పార్టీకి నూతన శక్తిని తీసుకొస్తుందని అన్నారు. యువతలో నూతన ఊపు తీసుకురావాలి టి ఆర్ పి ను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి ప్రజల సమస్యలకు పక్షపాతం లేకుండా నిలబడాలి అని మల్లన్న సూచించారు.టి ఆర్ పి యువజన విభాగంలో కొత్త నాయకత్వం రావడంతో రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది. యువతకు చేరువగా, బహుజన హక్కుల కోసం పోరాడే దిశగా చంద్రశేఖర్ యువజన విభాగాన్ని ముందుకు నడిపిస్తారని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ సుదగాని హరిశంకర్ గౌడ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీ బందారపు నర్సయ్య, నాయకులు శ్రీ పాకాల నర్సింహ్మ, శ్రీ చింతపండు ప్రభాకర్, శ్రీ కిరణ్ ముదిరాజ్, డాక్టర్ సూర్య నారాయణ, శ్రీ వినీత్, శ్రీ శ్రీనివాస్, శ్రీ దశరథ, శ్రీ మల్లేష్, శ్రీ సుతారపు రంగన్న పాల్గొన్నారు.






