- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరొకసారి ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే
అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గత ప్రభుత్వాలు 60 సంవత్సరాలలో చేయలేని పనులు ఈ 10 సంవత్సరాలలో చేసి చూపించానని, మరొకసారి నన్ను ఆశీర్వదించాలని తుంగతుర్తి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ అన్నారు.

దిశ, శాలిగౌరారం: అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గత ప్రభుత్వాలు 60 సంవత్సరాలలో చేయలేని పనులు ఈ 10 సంవత్సరాలలో చేసి చూపించానని, మరొకసారి నన్ను ఆశీర్వదించాలని తుంగతుర్తి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ అన్నారు. ఆదివారం రోజు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అడ్లూరు, తిరుమల రాయినిగూడెం, జాలోని గూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...మరొకసారి అవకాశం ఇవ్వండి మండలంలో చాలా అభివృద్ధి పనులు చేసానని, పెండింగ్లో ఉన్న అన్నీ అభివృద్ధి పనులను కచ్చితంగా పూర్తి చేస్తానని ఈసారి తప్పకుండా కారు గుర్తుకు ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు కట్ట వెంకట్ రెడ్డి, స్థానిక ఎంపీపీ, జెడ్పీటీసీ, మండల అధ్యక్షులు ఐతగోని వెంకన్న గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కల్లూరి నాగరాజు గౌడ్, అడ్లూరు సర్పంచ్ బోడ నర్సయ్య, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దొనకొండ అంజయ్య, బిల్ల కంటి శ్రీను, పోలే వినోద్, వరికుప్పల వెంకటేష్, కొప్పు సైదులు తదితరులు పాల్గొన్నారు.






